సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం ఇంకా సద్దుమనగానే లేదు.. వర్ధమాన నటి ప్రియ భవాని శంకర్ మరోసారి పరిశ్రమలో లైంగిక వేధింపులు అంశాన్ని లేవనెత్తింది. బుల్లితెరపై ఇప్పటిదాకా సందడి చేసిన ప్రియా , ఇప్పుడిప్పుడే వెండి తెరపై బిజీ అవుతోంది. ఇటీవలే కార్తీకి జంటగా ఓ చిత్రంలో నటించింది. ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిజమేనని స్పష్టం చేసింది.
ఈ వేధింపులు అన్ని రంగాల్లో ఉన్నాయని ప్రియా చెప్పింది. అయితే వాటిని అంగీకరించడం ,నిరాకరించడం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. లైంగిక వేధింపులు గురించి శ్రీ రెడ్డి బహిరంగంగా చెప్పడం సరికాదని చెప్పింది. తప్పు చేసి, బయట చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నచింది. వేధింపులు బారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని తెలిపింది. తాను మాత్రం కుటుంబకధా చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పింది.