గంజాయి దమ్ము …హన్సిక పై కేసు

క్రేజ్ కోసం చేసే పనులు ఒక్కోసారి కొంప ముంచుతాయి. ఇప్పుడు హన్సిక పరిస్దితి అలాగే ఉంది. సినిమాకు క్రేజ్ వస్తుందని, హాట్ టాపిక్ గా మారుతుందని ఆమె రీసెంట్ గా తను నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ లో గంజాయి తాగుతున్నట్లు పోజ్ ఇచ్చింది. అయితే హన్సిక గంజాయి తాగితే నో ప్లాబ్లం..కానీ ఆమె వేసుకున్న కాషాయ వస్త్రాలే ఆమెను ఇబ్బందుల్లో తోసేసాయి. ఈ పోస్టర్ హిందువల మనోభావాలు కించపరిచేలా ఉందని పీఎంకే పార్టీ కోర్ట్ లో కేసు వేసింది. విచారణకు స్వీకరించిన కోర్ట్ ఏం డెసిషన్ తీసుకుంటుందా అని హన్సిక, ఆ చిత్రం టీమ్ ఎదురుచూస్తున్నారు.

చిత్రం వివరాల్లోకి వెళితే…హన్సిక 50వ చిత్రంగా యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హా టైటిల్ గా ఈ సినిమా చేస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లై ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమాలో డిఫెరెంట్ రోల్ లో హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌బోతోందిట‌. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించ‌గా, సినిమాటోగ్రాఫ‌ర్‌గా మార్క‌స్ పని చేస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది. మరో ప్రక్క హ‌న్సిక తెలుగులో సందీప్ కిష‌న్ తో క‌లిసి జి. నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.