పిలుపు త‌ధ్యం: బాల‌య్య కు జ‌గ‌న్ ముందుకెళ్లే ద‌మ్ముందా?

న‌టుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను ఇండ‌స్ర్టీ స‌మ‌స్య‌ల భేటికి పిల‌వ‌లేద‌న్న దానిపై ప‌రిశ్ర‌మ స‌హా ప్ర‌జ‌ల్లో ఇప్పుడు ఓ హాట్ టాపిక్. ప‌రిశ్ర‌మ‌లో గ్రూప్ రాజ‌కీయాల‌ను సాగుతున్నాయ‌ని… బ్యాకెండ్ బాల‌య్య‌ను తొక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌ల వినిపిస్తున్నాయి. ప్ర‌తిగా బాల‌య్య మీడియా ముందు త‌న అస‌హ‌నాన్ని ఎలా వెళ్ల‌గ‌క్కారో అందిర‌కీ తెలిసిందే. ఇండ‌స్ర్టీ స‌హా ప్ర‌భుత్వంపై బాల‌య్య అభ్యంత‌ర‌క వ్యాఖ్య‌లు అంతే దుమారం రేపుతున్నాయి. బాల‌య్య‌ని పిల‌వ‌లేద‌ని ఆయ‌నంటుంటే ..అన్ని విష‌యాలు ఆయ‌న‌కి చెప్పే చేస్తున్నామ‌ని నిర్మాత సి. క‌ళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు త‌ప్పెవ‌ర‌ది అన్న‌ది ప‌క్క‌న‌బెడితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తదుపరి ఇండ‌స్ర్టీలో జ‌రిగే ఏ కార్య‌క్ర‌మానికైనా ఈసారి బాల‌య్య‌ను క‌చ్చితంగా పిలిచే అవ‌కాశ‌మైతే ఉంది.

మొన్న‌టి భేటిలో బాల‌య్య‌కు చెప్ప‌కుండా భూములు పంచుకుంటునారా? లేదా? ఇంకేదైనా కార్య‌క్ర‌మం జ‌రుగుతుందా? అన్న‌ది ఈసారి బాల‌య్య‌కు ఓ క్లారిటీ వ‌స్తుంది. అయితే లాక్ డౌన్ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని టాలీవుడ్ పెద్ద‌లు క‌ల‌వ‌నున్న‌ట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటిలో ప‌రిశ్ర‌మ నుంచి నాగార్జున, సి. క‌ళ్యాణ్ స‌హా చాలా మంది పెద్ద‌లు పాల్గొనే అవ‌కాశం ఉంది. చిరంజీవి-జ‌గ‌న్ మ‌ధ్య ఉన్న ప్రెండ్ షిప్ కార‌ణంగా ఈ భేటీకి చిరంజీవి లీడ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలా చేసిన బాల‌య్య దృష్టిలో త‌ప్పే అవుతుంది కాబ‌ట్టి ఈసారి ఆఛాన్స్ బాల‌య్యకు ఇవ్వాల‌ని పెద్ద‌లు భావిస్తున్నారుట‌. ముందుగా జ‌గ‌న్ అపాయింట్ మెంట్ తీసుకోవ‌డం ద‌గ్గ‌ర నుంచి ఇండ‌స్ర్టీ స‌మ‌స్య‌ల‌న్నింటిపై ఆయ‌నే మాట్లాడేలా ముందుకొస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారుట‌.

ఒక‌సారి తెలిసో తెలియ‌కో త‌ప్పు జ‌రిగిపోయింది. మ‌ళ్లీ ఆ త‌ప్పును పున‌రావృతం చేయ‌కూడ‌దు కాబ‌ట్టి బాల‌య్య‌నే ఈసారి ప‌రిశ్ర‌మ పెద్ద‌గా భావించి ముందుంచే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ఆయ‌న ప‌లువురు నిర్మాత‌ల‌కు షూటింగ్ ఎలా నిర్వ‌హించుకోవాలి వంటి అంశాల‌పై త‌న‌కు తోచిన కొన్ని ఐడియాలు కూడా ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఆ అనుభ‌వాన్ని….తాజా ప‌రిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌నే మార్గ‌ద‌ర్శి కావాల‌ని పెద్ద‌లు భావిస్తున్నారుట‌. పెద్ద‌లు అనుకోవ‌డం వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ బాల‌య్య‌కు జ‌గ‌న్ అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న‌ది వైకాపా జ‌గ‌న్ ప్ర‌భుత్వం. ప్ర‌తిప‌క్షం టీడీపీ… అందులోనూ చంద్ర‌బాబు నాయుడుకి వియ్యంకుడు. ఈ కార‌ణంగా బాల‌య్య‌ను దూరం పెట్టినా పెట్టొచ్చు అనేది ఓ కార‌ణం. అయితే బాల‌య్య‌కు జ‌గ‌న్ పెద్ద అభిమాని. రాల‌య‌సీమ బ్యాక్ డ్రాప్ లో బాల‌య్య న‌టించిన సినిమాల‌కు జ‌గ‌న్ ఫిదా అయ్యేవార‌ని…పొలిటిక‌ల్ గా ఎలా ఉన్నా? జ‌గ‌న్ అభిమాన హీరో మాత్రం బాల‌య్య అన్న‌ది నిజం. మ‌రి ఆ అభిమానంతోనైనా బాల‌య్య‌ను జ‌గ‌న్ గుర్తిస్తారా? లేక చిరంజీవి అన్నా అంటూ మెగాస్టార్ నే ముందుంచుతారా? అన్న‌ది చూడాలి.