రవితేజ కొత్త చిత్రం డైరక్టర్ కు నిర్మాత ఆంక్షలు

బడ్జెట్ కంట్రోలు అనేది లేకపోతే సినిమాకు ముఖ్యమనే విషయం దర్శక,నిర్మాతలు గమనిస్తున్నారు. ముఖ్యంగా హీరో మార్కెట్ ని బట్టి ఎంతకు సినిమా అమ్ముడు అవుతుందనే విషయం లెక్కలు వేసి..దాన్ని బట్టి బడ్జెట్ లెక్కలు వేస్తున్నారు. తమ హీరో తాజా సినిమా హిట్ అయితే బడ్జెట్ దానంతట అదే పెరుగుతుంది. అదే సినిమా తేడా కొడితే బడ్జెట్ లిమిట్ లో చేయాలనే లెక్కలు నిర్మాతలు వేస్తున్నారు. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం పరిస్దితి అలాగే ఉంది. నిర్మాతలు బడ్జెట్ ని చాలా వరకూ తగ్గించాలని డిసైడ్ అయ్యారట.

‘నేల టిక్కెట్’ , ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు డిజాస్టర్ కావటంతో రవితేజ తో సినిమా చేసే నిర్మాతల పరిస్దితి గందరగోళంలో పడింది. రవితేజతో రీసెంట్ గా సినిమా ఎనౌన్స్ చేసిన నిర్మాత రామ్ తాళ్లూరి తన తాజా చిత్రాన్ని చాలా కంట్రోలుగా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట.ఈ విషయమై దర్శకుడు విఐ ఆనంద్ తో చర్చించి నిర్ణయం తీసుకున్నారట. సైన్స్ ఫిక్షన్ గా రూపొందే ఈ చిత్రానికి ఇలా బడ్జెట్ కంట్రోలు లో పెట్టడం డైరక్టర్ కు చాలా ఇబ్బందిగా ఉందిట.

త్వరలో ఈ సినిమాకు ముందుగా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మాతగా సైన్స్-ఫిక్షన్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతోంది. తన కెరీర్ లో రవితేజ చేస్తున్న మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. ఇందులో ఓ హీరోయిన్ గా నభా నటేష్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారు. ఆర్ఎక్స్-100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇందులో ఇంకో హీరోయిన్ కు కూడా స్థానం ఉంది. ఆమె పేరును త్వరలోనే ప్రకటించబోతున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు టైటిల్ గా డిస్కోరాజ్, డూప్లికేట్ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు.