బోయపాటి తీసిన “వినయ విధేయ రామ” సినిమా విడుదలై విమర్శల పాలేంది. ఇదో కామెడీ పీస్ గా జనం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు. రివ్యూలు ఏదీ పాజిటివ్ గా రాలేదు. అందరూ సినిమాని ఏకి పారేసారు. ముఖ్యంగా అందరి టార్గెట్ బోయపాటి శ్రీను, ఆయన మేకింగ్ , ఊర సీన్స్ అయ్యాయి. అంతవరకూ బాగానే ఉంది.. కానీ ఇప్పుడు ఈ వాదనలు, వెటకారాలు మరో టర్న్ తీసుకున్నాయి. బోయపాటిని విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.
కొందరు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా పై వస్తున్న ట్రోలింగ్ ని తట్టుకోవటానికి, లేదా తిప్పి కొట్టడానికి ఓ విచిత్రమైన వాదనని పైకి తీసుకొచ్చారు. బోయపాటి శ్రీను మొదటి నుంచీ నందమూరి బాలకృష్ణ క్యాంప్ కు చెందినవాడు…సేమ్ సామాజిక వర్గం…కాబట్టే… ఈ సినిమాని కావాలని, పని గట్టుకుని చెడగొట్టాడని అంటున్నారు.
బాలకృష్ణ హీరోగా చేసిన “ఎన్టీఆర్ కథానాయకుడి”కి పోటీగా ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి బాలయ్యకి భాక్సాఫీస్ వద్ద హెల్ప్ చేసే ఉద్దేశంతోనే బోయపాటి మరీ ఇంత దారుణంగా తీశాడని మెగాభిమానుల్లో కొందరు సోషల్ మీడియా వేదికటా తమ వాదనను వినిపిస్తున్నారు.
అయితే వారు మర్చిపోతోంది ఏమిటి అంటే అల్లు అర్జున్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్ (సరైనోడు) ఇచ్చింది బోయపాటి అనే విషయం. మరి దానికి వారేం సమాధానం చెప్తారో.
కానీ బోయపాటి సన్నిహితులు ఆయన అలాంటి దర్శకుడు కాదు.. ఏ హీరోతో అయినా వారికి బెస్ట్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తాడంటున్నారు. ఐతే..ఈ సారి కథ లేకుండా సెట్స్‌కి వెళ్లడంతోనే ఇంత సమస్య వచ్చిందట.
రివ్యూలు, రేటింగ్స్, విమర్శలు, ట్రోలింగ్ ఇవన్నీ ఎలా ఉన్నా..మొదటి రోజు ఈ సినిమా భారీ వసూళ్లను అందుకొంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి వస్తాయి కాబట్టి… ఈ వీకెండ్ ఈ సినిమా కలెక్షన్లకి పెద్దగా సమస్య రాకపోవచ్చు అని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి.