పాపం.. ‘అడ కత్తెరలో పోక చెక్క’ లాగ బోయపాటి

బోయపాటి పరిస్దితి ఇప్పుడు ‘అడ కత్తెరలో పోక చెక్క’ లా తయారైంది. వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ కావటం ఆయన కెరీర్ ని పూర్తిగా వెనక్కి లాగేసింది. ఎప్పుడూ ఏ సినిమాకు రానంత బ్యాడ్ నేమ్ ఈ ఒక్క సినిమా తెచ్చిపెట్టింది. దానికితోడు నిర్మాత డివివి దానయ్య తగువు పెట్టుకోవటం కూడా బోయపాటిక ఓ వర్గానికి దూరం చేసింది. ఇప్పుడు బోయపాటి ముందున్న ఒకే ఒక ఆప్షన్ బాలయ్యతో చేసి హిట్ కొట్టడం. అయితే బాలయ్య డేట్స్ ఇస్తానన్నాడు హ్యాపీ. అయితే అసలు చిక్కంతా అక్కడే వచ్చింది.

బాలయ్య సైతం కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల డిజాస్టర్స్ తో బిజినెస్ వర్గాల్లో క్రేజ్ పోగొట్టుకున్నాడు. బోయపాటిది అదే పరిస్దితి. దాంతో వీరిద్దరి కాంబినేషన్ అనగానే బిజినెస్ అవుతుందనే నమ్మకం ఎంత మాత్రం లేదు. ఈ నేపధ్యంలో నిర్మాతలు వెంటనే రారు. పోనీ బాలయ్య తన సొంత బ్యానర్ పై చేద్దామంటే…మహానాయకుడుతో నష్టపోయినవాళ్లకు సెటిల్మెంట్ చేయాలి. దాంతో బయిట నిర్మాతగా సి. కళ్యాణ్ ని ఎంచుకున్నారు.

సి. కల్యాణ్ తో సినిమా చేయటానికి దర్శకులు పెద్ద ఉత్సాహం చూపరు. ఎందుకంటే ఆయన ఆర్దిక విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ప్రతీ రూపాయి తెర మీద కనపడాలి అంటారు. క్రింద నుంచి పైకి వచ్చి న వాడు కావటంతో డబ్బుని విచ్చిలివిడిగా ఖర్చు పెట్టనివ్వరు. ఇవన్నీ బోయపాటి శ్రీను వంటి లావిష్ గా ఖర్చు పెట్టే దర్శకుడుకు కాస్త ఇబ్బంది కలిగించే అంశాలే. అలాగని నేను ఈ నిర్మాతతో చేయను అనే పరిస్దితి లేదు. ఉన్నంతలో ఎడ్జెస్ట్ అయ్యి..హిట్ కొట్టాలి. దాంతో ముందుకు వెల్లలేడు..వెనక్కి వెళ్లలేడు..’అడ కత్తెరలో పోక చెక్క’ లాగ బోయపాటి పరిస్దితి తయారైంది అంటున్నారు.