బాలీవుడ్ రీమేక్ గా ఓ బేబీ !

బాలీవుడ్ రీమేక్ గా ఓ బేబీ !

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఓ బేబీని రీమేక్‌ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.

తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ బాలీవుడ్‌ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట.

బాలీవుడ్‌ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సమంత పాత్రకు కంగనా లేదా అలియా భట్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.