బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన కొత్తలో కంటెస్టెంట్స్ తోనే నిరాశపరిచారు షో నిర్వాహకులు. ఈ సారి సెలబ్రెటిల విషయంలో బిగ్ బాస్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక నిజానికి షో నడిచినన్ని రోజులు పెద్దగా రేటింగ్స్ కూడా ఏమి రాలేదు. కోట్లాది మంది విక్షిస్తున్నారని ప్రచారాలు బాగానే చేస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా అయితే బిగ్ బాస్ పెద్దగా రెస్పాన్స్ అందుకోలేకపోతోంది.
గంట కంటెంట్ కూడా దొరకడం లేదా అనేంతలా ట్రోలింగ్స్ అయితే గట్టిగానే అందుకున్నారు. హోస్ట్ గా నాగార్జున కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే షోకు సంబంధించిన మరొక గాసిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకా ఫైనల్స్ కూడా పూర్తవ్వలేదు.. అప్పుడే సీజన్ 5 హోస్ట్ విషయంలో రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో సీజన్ కు అక్కినేని ఫ్యామిలీకి చెందిన మరో స్టార్ హోస్ట్ గా బాధ్యత తీసుకోనున్నారట.
ఆ స్టార్ మరెవరో కాదు. అక్కినేని సమంత. దసరా రోజు స్పెషల్ గా హోస్ట్ బాధ్యత తీసుకున్న సమంత తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఆమె ఒక్క రోజు సీఎంలా ఒక్క రోజు హోస్టింగ్ తో భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. రెటింగ్ ఒక్కసారిగా పెరిగిపోయినట్లు టాక్ కూడా వచ్చింది. ప్రస్తుతం ఆహా యాప్ లో సామ్ జామ్ అనే సెలబ్రెటీ టాక్ షోకు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందుకే నెక్స్ట్ ఫుల్ సీజన్ కు ఆమెని ఫిక్స్ చేయనున్నారట. వచ్చే ఎడాది సమ్మర్ ఏండింగ్ లోనే సీజన్ 5ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు. నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.