బిగ్ బాస్ సీజన్-4 షూటింగ్ మొదలైపోయిందా? కంటెస్టెంట్లు అంతా షూటింగ్ లో నిమగ్నమయ్యారా? అంటే అవుననే తెలుస్తోంది. అయితే మరి ఇంకా ప్రసారం కాలేదంటి! అసలు ప్రసారం ఈనెలఖరునుంచి కదా. మరి ఇలా అప్పుడే షూటింగ్ మొదలైపోయిన ఈ మతలబు ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు సంగతుల్లోకి వెళ్లాల్సిందే. కరోనా కల్లోలం కారణంగా సినిమా వాళ్లు, సీరియల్స్ చేసుకునే వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందేగా. ఇప్పుడలాగే బిగ్ బాస్ నిర్వాహకులకు కరోనా తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ -4 కంటెస్టెంట్లు అంతా క్వారంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నెల చివరన షో ప్రారంభం సందర్భంగా అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వస్తే పక్కనబెట్టేస్తున్నారు. ఇంకాస్త ట్రీట్ మెంట్ సీరియస్ గా సాగుతోంది. అలాగని నెగిటివ్ వస్తే వదిలేస్తున్నారనుకుంటున్నారా? అంత సీన్ లేదు. నెగిటివ్ వచ్చినా వదలడం లేదు. కరోనా మహమ్మారి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తుందో తెలియడం లేదుగా. ఆరోగ్యంగా ఉన్న మనిషికి కరోనా సోకుతుంది. గుండ్రయిలా రోడ్డు మీద తిరుగుతున్నా పరీక్షలు చేసుకుంటే పాజిటివ్ వస్తున్న సంఘటనలు చూసాము. అదే భయం ఇప్పుడు బిగ్ బాస్ నిర్వహకుల్ని వెంటాడుతుండటంతో! ఆరోగ్యంగా ఉన్న అందర్నీ క్వారంటైన్ లో వేస్తున్నారు.
14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటారు. ఆ తర్వాత మళ్లీ పరీక్షలు చేస్తారు. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే అసలు షూటింగ్ మొదలు పెడతారు. ఈ పద్దతి మంచిందే. లేదంటే హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కిరిక కరోనా వచ్చినా కొంపంతా అంటుకుంది. రియాల్టీ గేమ్ షో మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అభిమానులు తీవ్ర నిరుత్సాహ పడాల్సి ఉంటుంది. అందుకే ముందస్తు చర్యలు షురూ చేసారు. ఇక షో ప్రారంభోత్సవం సందర్భంగా ఈ క్వారంటైన్ సన్నివేశాల్ని కూడా ప్రసారం చేయనున్నారుట.