బిగ్ బాస్ షోలో మిగతా ఇంటి సభ్యులు గొడవలు ఎన్ని పడుతున్నా కూడా అభిజిత్ మాత్రం చాలా కూల్ గా అడుగులు వేస్తున్నాడు. ఏ మాత్రం హడావుడి పడకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. మొన్నటివరకు అఖిల్, మోనాల్ విషయంలో కాస్త అసంతృప్తితోనే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం వారితో కూడా చాలా సరదాగా ఉంటున్నాడు. అభికి అభిమానుల సంఖ్య పెరగడానికి అతని మాట తీరు కూడా ఒక ముఖ్య కారణం.
ఇక గురువారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో అభిజిత్ తన మాటలతో కామెడీ టైమింగ్ తో ఎక్కువగా ఆకట్టుకొనున్నట్లు ప్రోమో ద్వారా ముందే క్లారిటీ ఇచ్చారు. ఈ సారి ఏకాగ్రత అనే టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 30నిమిషాల సమయాన్ని ఆలోచనతో లెక్కించాలని చెప్పాడు. ఆ సమయంలో మిగతా కంటెస్టెంట్స్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రశ్నలను కూడా సంధించవచ్చట. ఇక బిగ్ బాస్ హౌజ్ లో శివగామి అంటే ఎవరితో పోలుస్తావ్ అని హారిక ప్రశ్నించగా అభిజిత్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు.
శివగామిలో ఉన్న అందం మోనాల్ లో ఉంది. శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాలో ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హరికలో ఉంది.. అంటూ అభి ఇచ్చిన స్మార్ట్ ఆన్సర్ కు అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో జరిగే పరిణామాలను బట్టి కంటెస్టెంట్స్ ను బాగా పరిశీలించినట్లు కూడా అర్ధమయ్యింది. ఇక మోనాల్ ను కూడఖ్ పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతున్నట్లు ప్రోమోలో చూపించారు. చూస్తుంటే ఈ రోజు కాస్త అభి హవాక్ నడిచేలా ఉందని అర్దమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..