రాత్రి 9. 00 గంటలకే “బిగ్ బాస్ “

రాత్రి 9. 00 గంటలకే “బిగ్ బాస్ “

ఎవరు నిరసనలు తెలిపినా , అమ్మాయిలూ మీడియా లో కోడై కూసినా , ఉస్మానియా విద్యార్థులు ఇంటిని ముట్టడించినా , షో ను ఆపాలసిందేనంటూ కోర్టు కెక్కినా అటు స్టార్ మా కానీ , ఇటు షో హోస్టు నాగార్జున కానీ స్పందించలేదు . సైలెంట్ గా బిగ్ బాస్ షోకు అంతరాయం లేకుండా తెర వెనుక ఎవరూ ఊహించని ప్రయత్నం చేసుకున్నారు . నాగార్జున ప్రభుత్వంతో తనకున్న పలుకుబడినతటినీ ఉపయోగించాడని చెప్పుకుంటున్నారు .

బిగ్ బాస్ షో కోసం అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో గాయత్రీ గుప్తా, శ్వేతా రెడ్డి అనే ఇద్దరు మహిళలు అవమానానికి , ఆగ్రహానికి గురయ్యారు , 100 రోజులపాటు జరిగే షోలో సెక్స్ లేకుండా వుంటారా? అని వారిని అడగటంతో వివాదం ముదిరి పాకాన పడింది . మీడియాలో చర్చలు , సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి . ఆఖరికి ఉస్మానియా విద్యార్థులు నాగార్జున ఇంటిని చుట్టుముట్టారు . అయినా నాగార్జున మొహం చాటెచాడే తప్ప మాట్లాడలేదు . ఎవరేమి అనుకుంటే నాకేం అన్నట్టు నాగ్ వ్యవహరించాడు .

ఈరోజు రాత్రి 9. 00 గంటలకు స్టార్ మా లో బిగ్ బాస్ ప్రసారం అవుతుందని మా టీవీ ప్రకటించింది . 100 రోజులపాటు ఈ షోలో 15 మంది వివిధ రంగాలకు చెందినవారు పాల్గొంటున్నారు , హేమ , శ్రీముఖి , తీన్మార్ సావిత్రి , హిమజా రెడ్డి , వరుణ్ సందేశ్ అతని భార్య వితిక , రవికృష్ణ , అలీరేజా , జాఫర్ , పునర్వి భూపాలం , బాబా భాస్కర్, రాహుల్ , టీవీ స్టార్ మహేష్ , రోహిణి , అషు రెడ్డి పేర్లు ఖరారు అయినట్టు తెలుస్తుంది .