‘బిగ్‌బాస్‌-3’ మొదలైంది.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదిగో..!

‘బిగ్‌బాస్‌-3’ మొదలైంది.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదిగో..!

వాదాలు.. నినాదాలు. ధర్నాలు, నిరసనలు.. ఇదీ బిగ్‌బాస్‌ 3 ప్రారంభం కాకుండానే బయిట జరుగుతున్న సిట్యువేషన్. సీజన్‌ను మొదలుపెట్టకముందే తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారటం ఓ రకంగా షో కు ప్లస్ పాయింటే. జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తాలు బిగ్‌బాస్‌పై ఆరోపణలు చేయడం, కేసులు పెట్టడం.. ఆఖరికి దేశ రాజధానిలో ధర్నాకు దిగడంతో షో మొదలవ్వకముందే మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ నేపధ్యంలో ఓ దశలో బిగ్‌బాస్‌ వాయిదా పడనుందని వార్తలు వినిపించినా.. ఎట్టకేలకు బిగ్‌బాస్‌ వచ్చేసాడు.

హోస్ట్‌ విషయంలో అధికారికంగా ప్రకటించిన స్టార్‌ మా టీమ్.. కంటెస్టెంట్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంది. చివరి వరకు కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ లీక్‌ కాకుడదని పకడ్బందీగా నిర్వహించింది. మొత్తానికి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటరయిన కంటెస్టెంట్లు ఎవరో అఫీషియల్ గానే తేలింది.

1.తీన్మార్ సావిత్రి (శివజ్యోతి)

2.టీవీ సీరియల్‌ నటుడు రవికృష్ణ

3.డబ్ స్మాష్ అషు రెడ్డి

4.టీవీ9 జాఫర్‌ బాబు

5. టీవీ నటి హిమజ

6. సింగర్ రాహుల్

7. సీరియల్ నటి రోహిణి

8. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
9.నటి పునర్నవి భూపాలం

10. సినీ నటి హేమ
11. టీవీ నటుడు అలీ రెజా

12. మహేష్‌ విట్టా

13.శ్రీముఖి

14.వరుణ్‌ సందేశ్‌

15. వితికా షేరు

నాగార్జున హోస్ట్ గా టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ తొలిరోజు పూర్తయింది. వీరంతా 90 రోజుల పాటు హౌస్ లో గడపనున్నారు.