బిగ్ న్యూస్ : “ఆచార్య” నష్టాలకి షాకింగ్ మొత్తం వెనక్కి ఇచ్చేసిన మెగా హీరోలు.!

Inside Report On Acharya

జస్ట్ ఈ గత రెండు మూడు రోజులు నుంచి మళ్ళీ టాలీవుడ్ ఎపిక్ డిజాస్టర్ “ఆచార్య” సినిమా నష్టాలు అలాగే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఈ సినిమా హీరోలు చిరు, చరణ్ లు కొరటాలను ఇబ్బందుల్లో వదిలేశారని అనేక కామెంట్స్ అయితే వినిపించాయి.

అయితే చిరు చరణ్ లు ఇన్వాల్వ్ కాకుండా ఉండాలని అంతా కొరటాల చూసుకుంటాని చెప్పిన మాట అయితే చాలా మందికి తెలియదు. నిజానికి కొరటాల తన ప్రతి సినిమా బిజినెస్ ను దగ్గరుండి అందరితో కలిసి చూసుకుంటారు. అయితే ఈ సినిమా కూడా అలాగే చెయ్యగా ఇది మాత్రం చాలా పెద్దదిగా కనిపించింది.

దీనితో సమస్య పెద్దగా మారడంతో మొత్తానికి రామ్ చరణ్ మరియు చిరంజీవిలు తాము తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేశారట. అది అక్షరాలా 20 కోట్లు ఇద్దరు కలిపి ఇచ్చారట. అయితే మరో మాట ఏమిటంటే ఈ సినిమాని ఇద్దరు హీరోలూ కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకొని చేశారు.

చిరుకి గాని చరణ్ కి గాని అదనంగా మరో రూపాయి ముట్టలేదట. అంటే ఈ సినిమాని ఆ ఇద్దరు కూడా ఫ్రీగా చేసేసినట్టే అని చెప్పాలి. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.