“బిగ్ బాస్ 3” పై పోలీస్ బాస్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ?
స్టార్ మా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకుంటున్న “బిగ్ బాస్ 3” చుట్టూ ఖాకీల ఉచ్చు బిగిస్తుందా ?
ఈ షో పేరుతో జరుగుతున్న 100 రోజుల సెక్స్ వ్యవహారాన్ని, యాంకర్ శ్వేతా రెడ్డి , నటి గాయత్రి గుప్తా హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు దీనిపై పోలీస్ బాస్ ల ద్రుష్టి పడింది . పోలీసులు ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది .
స్టార్ మా టీవీ ఛానల్ ఈ నెల 21 న రాత్రి 9. 00 గంటలకు ఈ షో ప్రసారానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది .
ఇప్పటికే ఈ షో లో నటించే వారి జాబితా లో హీరో తరుణ్, యాంకర్, నటి ఉదయభాను ,గాయకుడు హేమ చంద్ర , తీన్మార్ సావిత్రి శ్రీ రెడ్డి , వివా హర్ష , కె .ఏ .పాల్ , యాంకర్ ,నటి శ్రీముఖి , యాంకర్ , నటి లాస్య , జాహ్నవీ , రఘు మాస్టర్ , గాయకుడు రాహుల్ , వరుణ్ సందేశ్ , సగటు మనిషి . అయితే ఎవరు ఊహించని విధంగా శ్వేతా రెడ్డి , గాయత్రి గుప్తా తమను బిగ్ బాస్ షో కోసం సంప్రదించి .. ?బిగ్ బాస్ ను ఏరకంగా సంతృప్తి పరుస్తారు , 100 రోజుల పాటు సెక్స్ లేకుండా వుండగలరా ? మీరు పడుకోక పోతే అవకాశం ఎలా వస్తుంది ?” అని అడిగారని … బిగ్ బాస్ అంటే అదో సెక్స్ షో అని .. కాబట్టి ప్రజలు , పోలిసుల దృష్టికి తీసుకొస్తున్నామని ” వారిద్దరూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు .
ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది . ఈ షోకు అక్కినేని నాగ్ హోస్ట్ గా వున్నారు . హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ కోసం ఓ గ్రాండ్ గా ఓ సెట్ కూడా వేశారు .
శ్వేతా రెడ్డి , గాయత్రి గుప్తా ఫిర్యాదుతో ఈ షో పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి . ఇద్దరు అమ్మాయిలు చేసిన ఈ ఫిర్యాదుపై ఇప్పడు పోలీసులు పై అధికారుల దృష్టికి తీలుకెళ్లారు . బిగ్ బాస్ షో ను హోస్ట్ చేస్తున్న అక్కినేని నాగార్జున టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు . ఈ వ్యవహారం పై కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ?. ఒక వేళ నాగార్జున కాబట్టి ఎలాంటి చర్య , విచారణ చెయ్యవద్దని పోలీస్ బాస్ కు కేటీఆర్ చెప్పినా , ప్రతి పక్షాలు మాత్రం బిగ్ బాస్ షో బ్యాన్ చెయ్యాలని నినదించే అవకాశం వుంది . తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి .