ఐఎఫ్ఎఫ్ఎమ్ 2019: బెస్ట్ హీరోగా విజయ్

తెలుగులో సైరా చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన విజ‌య్ మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ సినిమాలోను న‌టించాడు. త‌మిళంలో ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్‌తో పాటు లాభం అనే సినిమా చేస్తున్నాడు. చివ‌రిగా సూప‌ర్ డీల‌క్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించాడు. ఇందులో ట్రాన్స్‌జెండ‌ర్‌గా అద్భుత న‌ట‌ప‌టిమ ప్ర‌ద‌ర్శించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఆ పాత్ర పోషించినందుకు ప‌లు అవార్డులు కూడా విజ‌య్ ఖాతాలో చేరాయి. ఇక తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జ‌రుగుతున్న‌ ఇండియ‌న్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎమ్)లో బెస్ట్ హీరో అవార్డ్ అందుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. ఈ హీరో న‌టించిన సంగ త‌మీజ‌న్ చిత్రం దీపావ‌ళికి ప్రేక్ష‌కుల రానున్న విష‌యం తెలిసిందే.