బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘కవచం’. కాజల్, మెహరీన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో… నీల్ నితిన్ ముఖేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ వారం విడుదల అవుతోంది.
ఈ చిత్రం స్టోరీ లైన్ ఏంటంటే..
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో పోలీసు అధికారిగా కనిపిస్తారు. అతని పాత్ర పేరు విజయ్. ఒక కేసులో ఆ పోలీసును ఇరికిస్తారు. దాని నుంచి అతడు 24 గంటల్లో ఎలా బయటపడ్డాడు అనేదే కథ. ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లతో చాలా వేగంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వారిలో ఎవరికి హీరో కవచంలా నిలిచాడు అనేది తెరపై చూడాల్సిందే’. మైండ్ గేమ్ నేపథ్యంలో కాప్ డ్రామా ఇది.
యాక్షన్ సీన్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘ప్రతి ఆటలోనూ గెలుపు, ఓటమి అనేవి రెండుంటాయి. ఓటమి నీ తలరాతా కాదు.. గెలుపు ఇంకొకడి సొత్తూ కాదు. వాటి స్థానం మారడానికి అర సెకను చాలు’ అనే డైలాగ్‌తో విడుదలైన ట్రైలర్ కు మంచి క్రేజ్ వచ్చింది. డిసెంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.