కాజల్ లో నెగిటివ్ యాంగిల్ ని చూస్తే షాక్ (వీడియో)

కాజల్ అగర్వాల్

ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విభిన్న కథా చిత్రం సీత. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. అలాగే కాజల్‌ నెగిటివ్‌రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో సోనూ సూద్‌ చాలా కాలం తరువాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించటం విశేషం.

ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ చేసారు.

సినిమాలో కీలకమైన సీత పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. టీజర్‌లో కూడా ఎక్కువగా ఈ పాత్రనే ఫోకస్‌ చేశారు.

Sita Teaser | 4K | Teja | Sai Srinivas Bellamkonda, Kajal Aggarwal | Anup Rubens

ఇన్నాళ్లు సీరియస్‌ యాక్షన్‌ రోల్స్‌ లో కనిపించిన శ్రీనివాస్‌ ఈ సినిమా కామెడీ టచ్‌ ఉన్న పాత్రలో నటించాడు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు.

కవచం సినిమా తరువాత కాజల్‌కు బెల్లంకొండతో ఇది రెండవ సినిమా. మరోవైపు ఇప్పటికే విడుదలైన సీత ఫస్ట్‌ లుక్‌ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.