“చెన్నకేశవ రెడ్డి”తో యూఎస్ లో ఆల్ టైం రికార్డు కొట్టేసిన బాలయ్య..!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇప్పుడు రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాగే ఇంకో పక్క ఈ షూటింగ్స్ జరుగుతుండగా తెలుగులో రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన రీ రిలీజ్ ట్రెండ్ లో తన మాసివ్ బ్లాక్ బస్టర్ “చెన్నకేశవ రెడ్డి” ని అభిమానులు ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేసుకున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకి అంత భారీ మొత్తంలో రిలీజ్ కాలేదు కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం యూఎస్ లో దుమ్ము లేపారు. ఈ సినిమాకి ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా కూడా రిలీజ్ కానీ విధంగా రికార్డు లొకేషన్స్ రికార్డు నెంబర్ షోలు తో రిలీజ్ చేసారు.

దీనితో ఇది ఒక ఆల్ టైం రికార్డుగా నెలకొనగా వసూళ్లు కూడా అంతే మొత్తంలో ఆల్ టైం రికార్డు వసూళ్లు వచ్చాయట. ఇక ఈ చిత్రం యూఎస్ లో 77 లొకేషన్స్ లో రిలీజ్ చెయ్యగా మొత్తం 81కి పైగా షోలు పడ్డాయట. ఇక వసూళ్లు అయితే 40వేల డాలర్స్ కి పైగా వచ్చాయట.

దీనితో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పేరిట ఉన్న 35వేల “జల్సా” రికార్డు ఇప్పుడు బద్దలయ్యింది. ఈ రకంగా అయితే బాలయ్య యూఎస్ లో సెన్సేషన్ ని సృష్టించారు.