నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 106వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల ఓ కొలిక్కి వచ్చాయి. సినిమా లాంఛనంగా ప్రారంభమైనా దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ ఆదేశాల మేరకు స్ర్కిప్ట్ సహా నటీనటులు..సాంకేతిక నిపుణుల ఎంపిక పక్కాగా ఒక్కటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని బరిలోకి దిగుతున్నారు. అందువల్ల సినిమా సెట్స్ కు వెళ్లడం ఆలస్యమైంది. తాజాగా ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.
నాటి నుంచి ఏకధాటిగా గ్యాప్ లేకుండా వీలైంనంత త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రిలీజ్ పై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. జులై లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారుట. పక్కాగా తేదీ ఖరారు చేయలేదు గానీ..ఆ నెల రిలీజ్ అయితే బాగుంటుందని బాలయ్య అండ్ టీమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక షూటింగ్ దాదాపు ఇండియాలోనే ప్లాన్ చేస్తున్నారుట. అవసరమైతే పాటల చిత్రీకరణ కోసమే విదేశాలకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
హీరోయిన్ హాట్ బ్యూటీ నమితను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో హీరోయిన్ గా క్యాథరీన్ ను భారీ పారితోషికం ఆఫర్ చేసి తీసుకున్నట్లు తెలిసిందే. ఇందులో ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంకా పలువురు బాలీవుడ్ నటులను సినిమాలో భాగం చేస్తున్నట్లు తెలిసింది. ఈ వివరాలన్నింటిని త్వరలోనే అధికారికంగా యూనిట్ వెల్లడించనుదని సమాచారం. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంప మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గతంలో బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, లెజెండ్ చిత్రాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 106 తో హ్యాట్రిక్ కొట్టి సత్తా చాటాలని చూస్తున్నారు.