యాంకర్ ప్రదీప్ పెళ్లిపై ఇంకెన్నాళ్లు సెటైర్లు పడతాయో!!

ఓ వైపు వెండితెర బ్యాచ్‌లర్ లిస్ట్ తగ్గుతూ ఉంటే.. బుల్లితెర బ్యాచ్‌లర్ లిస్ట్‌ పెరుగుతోంది. నిఖిల్, నితిన్, రానా వంటి హీరోలు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయ్యారు. అయితే బుల్లితెరపై ఎప్పటి నుంచో ఏకాకిలా ఉంటోన్న సుధీర్, ప్రదీప్, హైపర్ ఆది వంటి వారు మాత్రం ఇంకా ఒంటిగానే ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ ముగ్గురికి అదే చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. తాజాగా ప్రదీప్ పెళ్లిపై దారుణమైన సెటైర్ పడింది.

Baba Bhaskar About Pradeep In Bapu Bommalu Pellanta
Baba Bhaskar About Pradeep

పండుగలు వస్తున్నాయంటే చాలు తెలుగు చానెళ్లు ప్రత్యకమైన ఈవెంట్స్ చేస్తుంటాయి. జబర్దస్త్ టీమ్, కమెడియన్స్, సింగర్స్, స్పెషల్ గెస్ట్స్, కొరియోగ్రాఫర్స్ ఇలా అందరితో కలిసి ఈవెంట్స్ చేయడం పరిపాటిగా వస్తోన్న విషయమే. ఈ వినాయక చవితికి రెండు అదిరిపోయే ఈవెంట్స్ రెడీ అవుతున్నాయి. 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ జబర్దస్త్ టీం వస్తోండగా.. నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా బాపు బొమ్మకు పెళ్లంటా అంటూ అదిరింది టీం రెడీ అవుతోంది.

ఇక వీరంతా వరుసగా ప్రోమోలతో దాడి చేస్తున్నారు. అందులో తాజాగా బాపు బొమ్మకు పెళ్లంటా ఈవెంట్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. అందులో బాబా భాస్కర్ వేసిన పంచ్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రదీప్, జానీ మాస్టర్‌లను ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు బాబా మాస్టర్. ఇంకెన్నాళ్లు ఇలా ఉంటావ్ పెళ్లి చేసుకోవచ్చు కదరా అని బాబా మాస్టర్ కౌంటర్ వేశాడు. బాబా మాస్టర్ వేసిన కౌంటర్‌కు ప్రదీప్ స్పందిస్తూ.. అలాంటివన్నీ పెద్దోళ్లు చూసుకుంటారు అని సమాధానమిచ్చాడు. మళ్లీ అందుకున్న బాబా.. నీ కంటే పెద్దవాళ్లు ఎవరు ఉంటారురా అని రివర్స్ పంచ్ వేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇలా యాంకర్ ప్రదీప్‌పై ప్రతీ సారి పంచ్‌లు పడుతూనే ఉంటున్నాయి. కానీ అతనికి మాత్రం పెళ్లి ఘడియలు రావడమే లేదు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles