కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు అనే వాదన ఒకటి నడుస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని విషయాలను నిశితంగా పరిశీలిస్తే అవి నిజమేనన్న ఫీలింగ్ కలుగుతుంది. చిరంజీవి బర్త్ డే ఆగస్ట్ 22. పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. ఈ విషయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరిని అడిగినా చెబుతారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో ఆధిపత్యంపై పోరు జరుగుతోంది. ఎవరి విషయాలు ఎక్కువగా ట్రెండ్ అయితే ఆ హీరోనే గ్రేట్ అనే స్థాయికి వచ్చేశారు.
సోషల్ మీడియాలో స్టార్లకు తక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నా, ఆయన బర్త్ డే, సినిమా టీజర్, ట్రైలర్, ఇలా ఏవైనా ట్రెండ్ కాకపోయినా సదరు హీరోకు రేంజ్ లేదనే భావన వస్తోంది. అందుకే హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా రికార్డుల మీద పడ్డారు. దక్షిణాది మొత్తానికి ఈ జబ్బు పట్టింది. తెలుగులో అయితే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్యే జరుగుతుంది. ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం, మిలియన్ల కొద్ది ఉన్న ట్వీట్ల రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు.
ఇక ఈ ప్రాసెస్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేడు ఓ ట్రెండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కామన్ డీపీని ట్రెండ్ చేస్తున్నారు. చూస్తుంటే మహేష్ బాబు బర్త్ డే ట్వీట్ల (60.2 మిలియన్లు) రికార్డులను కొట్టేసేట్టు ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడో సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే ఫ్యాన్స్ శ్రద్ద పెడుతున్నారే గానీ.. ఆగస్ట్ 22న ఉన్న చిరు బర్త్ డేను లైట్ తీసుకుంటున్నారు. చిరు 65వ బర్త్ డే సందర్భంగా ఇండియా వ్యాప్తంగా 65 మంది సెలెబ్రిటీలతో కలిపి కామన్ మోషన్ పోస్టర్ విడుదల చేసే కార్యక్రమాన్ని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే చేపట్టారు. గానీ ఇరువురు ఫ్యాన్స్ మాత్రం కలిసి పని చేయడం లేదని వీటిని బట్టి అర్థమవుతోంది.