‘జబర్దస్త్’ ఫేమ్‌ నరేష్ టీమ్‌ పైదాడి, కారణం ఇదీ

ఈటీవీలో జబర్దస్త్ షో వచ్చాక ఎంతోమంది ఆర్టిస్టులకు ఉపాధి దొరకడమే కాదు,ఆర్ధికంగా కూడా ఆర్టిస్టులు నిలదొక్కుకున్నారు. కమెడియన్స్ గా సినిమాల్లో ఛాన్స్ లు,బయట ప్రోగ్రామ్స్ లో బిజీ అవ్వడం తో పాటు టి ఆర్పీ రేటింగ్ దూసుకెళుతోంది. దాదాపు అందరు ఆర్టిస్టులు స్టార్ సెలబ్రిటీలుగా మారిపోయారు. అయితే ఒక్కోసారి వారికి ఆ సెలబ్రెటీ స్టేటసే సమస్యగా మారుతోంది. తాజాగా జబర్ధస్త్ ఫేమ్ నరేష్ టీమ్ పై దాడి జరిగింది.

వివరాల్లోకి వెళితే… కళింగాంధ్రా ఉత్సవాల్లో ప్రోగ్రాం చేసారు జబర్దస్త్ ఫేమ్‌ నరేష్ టీమ్‌. వారు ఆ పోగ్రాం ముగించుకొని వెళ్తుండగా వారిపై దాడి జరిగింది. శ్రీకాకుళం చిన్నబరాటం వీధికి చెందిన యువకులు దాడి చేశారు.పోగ్రాం పూర్తయ్యాక..అక్కడ యువకులు కొందరు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూసారు.

అలా చూడటాన్ని బౌన్సర్‌లు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దీంతో నరేష్ టీమ్ తిరుగుప్రయాణం అయ్యాక మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న వారు దాడికి పాల్పడిన ఓ యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దాడికి కారణమైన వాళ్లని అరెస్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ పోలీసులను అదేశించారు.

ఇక నిత్యం వత్తిడులకు గురయ్యాయేవాళ్లు రిలీఫ్ గా జబర్దస్త్ షో పెట్టుకుని చూసే స్థాయికి చేరింది. అయితే జబర్దస్త్ లో కొందరి ఆర్టిస్టులపై రూమర్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి.