కంచరపాలెం కాన్సెప్ట్ వేరు.. ఆ తర్వాత రానా మైండ్ బ్లాక్!
చిన్న సినిమాలకు పెద్ద ప్రమోషన్ చేసేందుకు రానా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అయితే అతడు ఓ సినిమాని ఎంపిక చేయాలంటేనే చాలా టైమ్ తీస్కుంటాడు. సెలక్టివ్ గా సినిమా నచ్చితేనే దానికి ప్రచారం చేసేందుకు ముందుకొస్తాడు. కథ- కంటెంట్ ఉంటేనే అతడు ఓ చెయ్యేస్తాడు. ఆ కోవలోనే తాజాగా రానా మెచ్చిన చిత్రం `అర్థ శతాబ్ధం`. టైటిల్ లోని రిథమ్ చూస్తుంటేనే సినిమాలో మ్యాటర్ ఉందని అర్థమవుతోంది. టైటిల్ కి తగ్గట్టే ఈ మూవీ ఆద్యంతం ఎమోషనల్ కంటెంట్ తో రక్తి కట్టించబోతోందని పరిశ్రమలో ఇన్ సైడ్ టాక్.
తాజాగా చిత్ర కథానాయకుడు `కార్తిక్ రత్నం` పుట్టినరోజు సందర్భంగా `అర్ధ శతాబ్దం` చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు అక్కి ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. ఫస్ట్ గ్లింప్స్ అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది.
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ `నారప్ప`లో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నాడు, అలాగే అర్థ శతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో అలరించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దర్శకుడు రవీంద్ర ఎంపిక చేసుకున్న కథను నేరేట్ చేసినట్టే..దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని నిర్మాత తెలిపారు. ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ మూవీ పూర్తి వివరాల్ని చిత్రబృందం వెల్లడించనుంది. అష్కర్ కెమెరా, నైఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్ , అక్కి ఆర్ట్స్, రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే.