ఇన్ సైడ్ టాక్ : ట్రైలర్  అరాచకమేనట, వ్యూస్ రికార్డ్ లు బ్రద్దలే

మాటల మాంత్రికుడుగా పేరు బడ్డ  త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ .. వచ్చేనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.  అలాగే  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  గాంధీ జయంతి రోజైన అంటే  ఈ రోజు (అక్టోబర్ 2) న  సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసారు.  దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

 అలాగే ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ ను నిర్మాతలు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.   ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు.  ఈ ఈవెంట్ లో ఏ సమయానికి ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని నిర్మాతలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంటే ఈ రోజు సాయంత్రం 8:10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట.  థియేట్రికల్ ట్రైలర్ టైమ్ ఫిక్స్ చేయడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. అంతేకాదు ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి సైతం పెరిగింది.

టాలీవుడ్ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ట్రైలర్ …త్రివిక్రమ్ తరహా..ఫన్, సెంటిమెంట్, ఎమోషన్, ఫిలాసపీ అన్ని కలగలపి ఉంటుందిట. ట్రైలర్ చూసిన వాళ్లు …త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటారట. అలా ఉండబోతోందని , ట్రైలర్ అరాచకం గా రికార్డ్ లు బ్రద్దలు కొడుతుందని అంటున్నారు.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడటమే కాదు .. ఫ్యాక్షన్ నేపథ్యంలో కనిపించనున్నాడు.  రాయల సీమలో ఫ్యాక్షన్ కారణంగా భర్తలను .. పిల్లలను .. అన్నదమ్ములను కోల్పోయిన స్త్రీల పరిస్థితులకి సంబంధించిన కోణంలో ఈ కథ కొనసాగుతుందట. వాళ్ల ఎమోషన్స్ చూసిన హీరో ఎలా స్పందిస్తాడు? .. ఏం చేస్తాడు? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైందట. యాక్షన్ .. ఎమోషన్ తో ముడిపడిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించింది