స్వీటీ నుండి అనుష్కగా మారే పదహారేళ్లు అయిపొయింది. స్వీటీగా ఉన్నప్పుడే పెళ్లి చేయాలనుకున్నారట. కానీ అంతలో సినిమాల్లోకి రావడం.. స్టార్ హీరోయిన్ అయిపోవడం.. మొత్తానికి తెలియకుండానే అనుష్క జీవితం చాల ముందుకు వచ్చేసింది. నిజానికి అనుష్కకి ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడు వచ్చింది. అప్పుడే పెళ్లి చేసి ఉండి ఉంటే.. ఈ పాటికి అనుష్క కూతురు కూడా హీరోయిన్ అయిపోయి ఉండేది. ఇలాంటి మాటలు ఇప్పటికే అనుష్క మీద సోషల్ మీడియాలో చాలానే వినపడ్డాయి. అయినా అనుష్క మాత్రం పెళ్లి చేసుకోలేదు.
అనుష్క పెళ్లి అనగానే ఆడియన్స్ కి తెగ ఆసక్తి. అందుకే ఇప్పటికే పలుమార్లు అనుష్క పెళ్లి పై రూమర్లు హల్ చల్ చేశాయి. కానీ ఆ రూమర్స్ లో ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయితే కొన్ని నెలలు క్రితం అనుష్క పెళ్లి పై ఒక రూమర్ బాగా ఎఫెక్ట్ చూపించింది. ఓ సీనియర్ దర్శకుడి కుమారుడు, అనుష్కను వివాహం చేసుకోబోతున్నాడని గతంలో వచ్చిన ఆ పుకార్లల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదు. కానీ ఇప్పుడు అనుష్క పెళ్లి పై తాజాగా మరో రూమర్ వచ్చింది.
అనుష్క తన బంధువుల అబ్బాయినే పెళ్లి చేసుకోబోతుందని.. డిసెంబర్ లో పెళ్లి ఉండే అవకాశం ఉందనేది ఆ రూమర్ తాలూకు కంటెంట్. అసలు దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు గాని, కోలీవుడ్ లో కూడా ఈ రూమర్ బాగానే వైరల్ అవుతుంది. అయితే తాజాగా అనుష్క పెళ్లి విషయంలో వస్తోన్న ఈ గాసిప్ ఎందుకో నమ్మే విధంగా ఉంది. ఏది ఏమైనా అనుష్క త్వరగా పెళ్లి చేసుకుంటే గాని, ఈ రూమర్లు ఆగవు. ఇక అనుష్క ‘నిశ్శబ్దం’ ఓటిటిలో విడుదలకు సిద్ధంగా ఉంది.