అనుష్క తర్వాత మూవీ నానితోనా?

‘బాహుబలి’ తరువాత ‘భాగమతి’ సినిమాతో మరో భారీ విజయాన్ని దక్కించుకుంది అనుష్క. దీని తర్వాత అనుష్క తదుపరి సినిమా గురించి అప్ డేట్స్ రాలేదు. ఇక ఈ బొద్దుగుమ్మ పెళ్ళికి సిద్దమయ్యింది అనుకున్నారంతా. పెళ్లి చేసుకోనుంది అనే వార్తలు కూడా బాగా వినిపించాయి. అయితే అనుష్క చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న మూవీలో నటించనుంది అనే టాక్ వినిపిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా గురించి ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు అని కధనాలు వెలువడ్డాయి. కానీ ఇది లేడీ ఓరియెంటెడ్ ఫిలిం. అనుష్క ఈ కధకు బాగా సూట్ అవుతుందని భావించి ఆమెకు స్టోరీ వినిపించారట దర్శకుడు. కానీ అనుష్క ఇంకా తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. ముందు అనుకున్నట్టు నాని హీరో కాదట కానీ అతని పాత్ర చేలా కీలకమైందని అంటున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.