మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క

                                                                             (ధ్యాన్) 

ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి .. మ‌రో ప‌క్క త‌న 152వ సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నారు. ఈ సినిమా క‌థ, స్క్రిప్ట్ రెడీ అవుతుంది. మ‌రో ప‌క్క ప్రీ ప్రొడ‌క్ష‌న ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎప్ప‌టిలాగానే మేసేజ్‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ సినిమా క‌థను కొర‌టాల సిద్ధం చేశార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న అనుష్క‌ను న‌టింప చేసేలా కొర‌టాల ఆమెను సంప్ర‌దించారు. భాగ‌మ‌తి త‌ర్వాత అనుష్క మ‌రో సినిమా చేయ‌లేదు. బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీగా ఉంది.