“ఆచార్య” కి మరో షాక్…?

ఈ ఏడాది మన తెలుగు సినిమా నుంచి చాలా వరకు మంచి మల్టీ స్టారర్ సినిమాలే రిలీజ్ కి వచ్చాయి. అయితే ఈ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన బిగ్ మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఒకటి.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియెన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. దీనితో ఈ సినిమా కనీ వినీ ఎరుగని స్థాయి నష్టాలను చూసింది. దీనితో చిరు మార్కెట్ కి కూడా పెద్ద దెబ్బ పడింది. ఇక ఈ నష్టాల్లో మళ్ళీ సరికొత్త చిక్కులు మేకర్స్ కి ఎదురవుతున్నట్టు తెలుస్తుంది.

మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సాంగ్ లో కూడా ఆమెని చూపించారు. కానీ తీరా సినిమాలో చూస్తే ఆమెని కట్ చేసేసారు. మరి ఇప్పుడు ఇదే మళ్ళీ ఆచార్య మేకర్స్ నష్టాన్ని కలిగించింది అట. ఈ సినిమాలో అంతటికి కలిపి కాజల్ వెర్షన్ తో తెలుగులో జెమినీ ఛానెల్ వారు భారీ ధరనే ఇచ్చి కొనుగోలు చేసారు.

కానీ తర్వాత కాజల్ రోల్ ని ట్రిమ్ చేసేయడంతో ఏకంగా సగం అమౌంట్ వెనక్కి ఇచ్చేయాలని అడుగుతున్నారట. మరి దీనికి కూడా వేరే కారణం ఉంది. సినిమా ఎలాగో ప్లాప్ దీనిని టెలికాస్ట్ కి తెస్తే మళ్ళీ ఆడియెన్స్ చూస్తారో లేదో తెలీదు అందుకే ఆ నష్టాలను పూడ్చడానికి సగం అమౌంట్ వెనక్కి ఇవ్వమంటున్నారట. అయితే ఇది కొన్ని రోజులు కితమే బయటకి వచ్చింది కానీ ఇప్పుడు వైరల్ గా మారింది.