జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి తెలియంది ఎవరికి. ఓ నటుడిగా కన్నా వ్యక్తిగతంగా ఎంతో గొప్ప మనసు కలిగిన వ్యక్తిగా ప్రేక్షకాభిమానులకు బాగా దగ్గరైన ఏకైక నటుడు. ఆయన చేసిన సినిమాలు తక్కువ.. సంపా దించింది తక్కువే. కానీ సేవాకార్యక్రమాలు మాత్రం అనంతం. అక్కడ ఎలాంటి కొలమానాలుండవు. రాజకీయ జీవితం అంటే అర్ధం..పరమార్ధం తెలిసిన వాడు. అందుకే నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు. అవినీతి లేని రాజకీయ వ్యవస్థను స్థాపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రాక్టికల్ గా ఎంత వరకూ సాధ్యమవుతుందో తెలియదు గానీ పవన్ రాజకీయాలు మాత్రం ఆయన ఉన్నంత కాలం చెరగని ఓ చరిత్ర.
తన మాటలతో సమాజాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మార్పు ఒక్క శాతం వచ్చినా చాలు అని సంకల్పించి ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఇలాంటి ఆలోచనలే ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ కి కూడా ఉండేవట. ఈ విషయాలన్ని సుషాంత్ రూమ్ మేట్ అయిన సిద్ధార్త్ పితానీ చెబుతున్నాడు. సినిమాల్లోకి ఇష్టపడి వచ్చిన తర్వాత ఆ సినిమాల్ని చూసి అసహ్యించుకున్నాడుట. అక్కడ రాజకీయాలు చూసి సినిమాల నుంచి తప్పుకోవాలనుకున్నాడు. తను కొనుగోలు చేసిన భూమిలో వ్యవవసాయం చేయాలనుకున్నాడుట. సమాజానికి మేలైన పనులు చేస్తే మనషిగా పుట్టినందు కు ఎంతో కొంత జీవితానికి ఓ అర్ధం ఉంటుందని భావించే వాడుట.
సమాజం పట్ల ఎంతో గౌరవం, మర్యాదగా ఉండేవాడని, సేవ చేయాలని ఎంతో తపించే వాడని సిద్దార్ధ్ తెలిపాడు. వర్చువల్ వీడియో బిజినెస్ చేయాలని, ఆ వ్యాపార బాధ్యతలు మొత్తం తనకే అప్పగిస్తాని సుషాంత్ తన తో చెప్పినట్లు సిద్దార్ధ్ పేర్కొన్నాడు. మిగతా స్టాప్ కింద ఎలాంటి ఉద్యోగాలు లేకుండా ఉండే తెలివైన విద్యార్ధులను తీసుకోవాలని సుషాంత్ భావించేవాడుట. వాళ్లందరికీ మంచి జీతాలు ఇచ్చి జీవితాన్ని ఇవ్వాలనుకునేవాడని తెలిపాడు. చదువు, ఉద్యోగం, కష్టం విలువ తెలిసినవాడు సుషాంత్ అని సిద్ధార్థ్ అభిప్రాయపడ్డాడు.