ప్రేమలో తేలిపోతోన్న అంజలి!!

సెలెబ్రిటీల్లో చాలా మంది పెట్స్ లవర్స్ ఉంటారు. కొందరు సొంత బిడ్డల్లా చూసుకుంటే ఇంకొందరు తోబుట్టువులా చూసుకుంటారు.. మరికొందరు బెస్ట్ ఫ్రెండ్‌లా పెట్స్‌ను ట్రీట్ చేస్తారు. ఇక అంజలి మాత్రం జీవితంలో తన పెంపుడు కుక్కకు అతి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. జర్నీ, షాపింగ్ మాల్, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఆకట్టుకున్న అంజలి.. చాలా గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది.

Anjali Adorable Pic WIth Pet POLO
Anjali Adorable Pic WIth Pet POLO

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అంజలి తాజాగా కొన్ని అపురూపమైన ఫోటోలను షేర్ చేసింది. నేడు ఇంటర్నేషనల్ డాగ్స్ డే అంటా. ఈ సందర్భంగా తనకు పెట్స్‌పై ఉన్న ప్రేమను చాటుకుంది. పోలో అనే పెట్‌ను అంజలి పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే. నా జీవితంలోకి నువ్ వచ్చి ఇంత ప్రేమను, సంతోషాన్ని పంచుతున్నందుకు థ్యాంక్స్ అంటూ తెగ మురిసిపోయింది.

అయితే అంజలి హీరో జైతో ప్రేమాయణం సాగిస్తోన్నట్టు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. వీరి విషయాన్ని ఓ తమిళ నిర్మాత బయటకు చెప్పడం మరింత రచ్చగా మారింది. అయితే మళ్లీ వీరిద్దరూ ఎక్కువగా వార్తల్లో నిలవలేదు. అయితే అంజలి మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది. నిశ్శబ్దం, వకీల్ సాబ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేందుకు సిద్దంగా ఉంది.