మహేష్ సినిమాకు అనీల్ రావిపూడి షాకింగ్ రెమ్యునేషన్

తొలి సినిమా ‘పటాస్‌’తోనే భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’తోనూ సక్సెస్ లు అందుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న సంక్రాంతి సీజన్‌లో కథానాయకుడు, వినయ విధేయ రామ వంటి భారీ చిత్రాలతో పోటీపడి విడుదల చేసిన ‘ఎఫ్2’ దుమ్ము రేపింది. దాంతో అనీల్ రావిపూడి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. దాంతో మహేష్ పిలిచి అవకాసం ఇచ్చారు. మహేష్ తో సినిమా అనగానే ఆ స్దాయికి తగ్గట్లుగా రెమ్యునేషన్ పెరిగిపోయింది.

దాంతో అనీల్ రావిపూడి…ఒక్కసారిగా ..టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో రాజమౌళి .. త్రివిక్రమ్ .. కొరటాల తరువాత స్థానంలో కు వచ్చేసారు. ఒక సినిమాకి మించి మరో సినిమాను సక్సెస్ వైపు పరుగులు తీయిస్తూ, చాలా తక్కువ కాలంలో అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయటం ఆశ్చర్యం కలిగించే విషయమైతే కాదు.

దిల్ రాజు – అనిల్ సుంకర నిర్మాతలుగా మహేశ్ బాబుతో చేయనున్న సినిమాకిగాను ఆయన 12 కోట్లను రెమ్యునేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు.