‘అర్జున్‌రెడ్డి’ కోసం అల్లు అర్జున్…

‘అర్జున్‌రెడ్డి’ అలియాస్ విజయ్ దేవరకొండ కోసం అతిథిగా మారాడు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘గీత గోవిందం’. ‘ఛలో’ ఫేమ్ రష్మిక మండన్న ఇందులో హీరోయిన్. ‘సోలో’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించారు. ఆదివారం ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరగనుంది. దానికి అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వస్తున్నాడు. అతను రావడం వెనుక మరో కారణం కూడా వుంది. అదేంటంటే… ‘గీత గోవిందం’ సినిమాకి కర్త, కర్మ, క్రియ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్. చిన్న సినిమాలు తీయడం కోసం గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధ సంస్థగా నెలకొల్పిన ‘జీఏ2’ సంస్థలో ‘బన్ని’ వాసు నిర్మాతగా ‘గీత గోవిందం’ తీశారు. నిర్మాత తండ్రే కనుక అల్లు అర్జున్ వస్తున్నాడు. ఈ సినిమాకి గోపిసుందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవల తెలుగులో గోపిసుందర్ మ్యూజిక్ చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. సినిమాలతో పాటు పాటలకూ బ్యాడ్ నేమ్ వచ్చింది. కానీ, ఈ సినిమాతో ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలే…’ పాట ఇన్స్టంట్ హిట్ అయితే, సెకండ్ సింగల్ ‘వాట్ ద ఎఫ్’ పర్వాలేదని పేరు తెచ్చుకుంది. మిగతా పాటలు ఎలా వుండబోతున్నాయో కొన్ని గంటల్లో తెలుస్తుంది.