`సైరా` కోసం సైలెంట్ అయిన బ‌న్నీ!

                                                           (ధ్యాన్)

సినిమా హిట్ అయిన సంతోషం ఒక‌వైపు, నెక్స్ట్ సినిమా ప‌రిస్థితి ఏంటా అనే టెన్ష‌న్ మ‌రోవైపు… ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ప‌రిస్థితి ఇది. త‌ప్ప‌క హిట్ అవుతుంద‌ని చెప్పి మ‌రీ కొట్టిన హిట్ కూడా ప‌ర‌శురామ్‌కి ఆనందాన్నివ్వ‌లేక‌పోతోంది. దీనికి కార‌ణం బ‌న్నీ. ప‌ర‌శురామ్ ప్ర‌మేయం ఉందో లేదోగానీ .. ఆయ‌న నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ లో బ‌న్నీతోనే అని ప్ర‌చారం జ‌రిగిపోయింది. సినిమా హిట్ అయితే బ‌న్నీ సినిమా ప‌క్కా అనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకూ రానంత మంది యువ‌త `గీత గోవిందం` విడుద‌ల రోజు థియేట‌ర్ల‌లో వాలిపోయారు. ఓపెనింగ్స్ అన్నీ అదిరిపోయాయి. ఇంకా అంతా శుభం.. ప‌ర‌శురామ్‌ని పిలిచి బ‌న్నీ సినిమా అనౌన్స్ చేసేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అది మాత్రం జ‌ర‌గ‌లేదు. సందట్లో స‌డేమియా అంటూ మంచు వారి పెద్ద‌బిడ్డ విష్ణు సీన్‌లోకి వ‌చ్చారు. ప‌ర‌శురామ్ నెక్స్ట్ సినిమా విష్ణుతో అనే గాసిప్ మొద‌లైంది. ఇది తెలియ‌గానే గీతా ఆర్ట్స్ సంస్థ అప్ర‌మ‌త్త‌మైంది. ప‌ర‌శురామ్ నెక్స్ట్ సినిమా త‌మ బ్యాన‌ర్‌లోనే అని క‌న్‌ఫ‌ర్మ్ చేసింది. అయితే హీరో ఎవ‌రో చెప్ప‌లేదు. 

కానీ ఇప్పుడు తెలిసిన ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే `సైరా` లో బ‌న్నీ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. దాని కోసం ఆయ‌న స్పెష‌ల్ గెట‌ప్‌లో ఉన్నారు. ఆ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తారు. అయితే శ‌నివారం ఆయ‌న `గీత గోవిందం` చిత్ర యూనిట్‌కు త‌న ఫామ్ హౌస్‌లో పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో ప‌ర‌శురామ్ నెక్స్ట్ మూవీ త‌న‌తోనే అని అనౌన్స్ చేస్తార‌నే వార్త కూడా వినిపిస్తోంది.