అల్లు అర్జున్ ..ఆ హీరోకు సెంటిమెంట్ గా మారాడా,అందుకే..

సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. తమ సినిమా హిట్ అయితే ఆ హిట్ కు కారణాలు అన్వేషించి,వాటిని సెంటిమెంట్స్ గా పెట్టుకుంటారు. అలాంటిదే అల్లు అర్జున్ ని గెస్ట్ గా పిలిచే విషయంలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొంది గీతా గోవిందం ఆడియో పంక్షన్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ..విజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచారని సమాచారం. ఈ మేరకు విజయ్ దేవరకొండ స్వయంగా బన్ని ని కలిసి రిక్వెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.

ఇక విజయ్ దేవరకొండ హీరో గా ‘టాక్సీవాలా’ రూపొందింది. వాస్తవానికి ‘గీతగోవిందం’ కంటే ముందుగానే ఈ సినిమాను విడుదల చేయవలసి వుంది. కానీ కొన్ని కారణాల వలన విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.

సైంటిఫిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 11వ తేదీన ఘనంగా నిర్వహించటానికి ప్లాన్ చేసారు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రానున్నాడు.

అల్లు అర్జున్ రాకతో అందరి దృష్టి ఈ సినిమా వైపుకు మళ్లుతుందని దర్శక,నిర్మాతలు. మాళవిక నాయర్ .. ప్రియాంకా జువాల్కర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, కల్యాణి ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది.