“ఎవరైనా ఎదిగితే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న ఆఫీస్ బ్యాయ్ ఇప్పుడు ప్రొడక్షన్ మ్యానేజర్. నా దగ్గర పదేళ్లు ఉండి కూడా అలానే ఉంటే అతనికి నేనేం చేసినట్టు? ఏం చేయలేదు అనే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. మనవాళ్లు మన పక్కనే ఉండకూడదు. మనతోపాటు ఎదగాలి అన్నారు అల్లు అర్జున్. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘టాక్సీవాలా’ విడుదల ప్రీ రిలీజ్ పంక్షన్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యి ఇలా మాట్లాడారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రమిది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ . రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. ఎస్.కె.ఎన్ నిర్మాత.
అలాగే.. విజయ్ దగ్గర ఒర్జినాలిటీ ఉంది. మేం అందరం, మా కాంటెపరరీస్ ఒక రొట్టలో స్టక్ అయిపోయాం. నువ్వు అందులో లేవు. కొత్తగా చేస్తున్నావు. ఆ తీరు జనాలకు నచ్చింది. విజయ్ మంచి నటుడు. మేం గోల్డెన్ ప్లేట్. నా లాంచ్ రాఘవేంద్రరావుగారు, అశ్వనీదత్‌గార్లు చేశారు. తను ‘ఎవడే, పెళ్లి చూపులు..’ ఇలా డిఫరెంట్ సినిమాలు చేస్తూ సొంతంగా వచ్చాడు. సెల్ఫ్‌మేడ్ పర్సన్. నేనెంత పెద్ద నటుడిని అయినా సెల్ఫ్‌మేడ్ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్ అని విజయదేవరకొండను మెచ్చుకున్నారు.
ఇక నేనెప్పుడూ టాలెంట్ ఉన్నోడి మీద జోక్‌లు వేయలేను. ఈ మధ్య విజయ్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. సడెన్‌గా స్టార్ అయితే నెగటీవ్ ఫోర్స్ కూడా ఉంటుంది. పట్టించుకోవద్దు విజయ్. అవన్నీ దాటి హిట్స్ కొడతావనే నమ్మకం నాకుంది. నాకంటే స్టార్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను.
నీ సక్సెస్‌ని ఎంజాయ్ చేసేవాళ్లలో నేనొకడిని అని నమ్ము. పైరసీ చేయడం చాలా తప్పు. సినిమా అనేది మీకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే. పేపర్‌లో నాలుగో పేజీలో వార్తే. కానీ మాకు అది జీవితం. అందర్నీ గౌరవిస్తారు. సినిమా వాళ్లకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి’’ అన్నారు.