షాకింగ్ : ఇప్పుడు ఒక్క రోజుకి అల్లు అర్జున్ పారితోషకం చుక్కల్లో ఉందట.!

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర తమ సినిమాలతో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోస్ లో సరికొత్త పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. మరి ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పుష్ప సినిమాతో భారీ స్థాయి క్రేజ్ ని తాను సొంతం చేసుకోగా ఇక్కడ నుంచి ఐకాన్ స్టార్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లోకి పెరిగిపోయింది.

ఇక ఇప్పుడు అయితే సినీ వర్గాల్లో ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ పై షాకింగ్ టాక్ వైరల్ గా మారుతుంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా కూడా అల్లు అర్జున్ ఒక్క రోజులో 7.5 కోట్లు పారితోషకం అందుకుంటున్నాడట. ఇది దిమ్మతిరిగే అంశం అని చెప్పాలి.

మరి వరుసగా అల్లు అర్జున్ యాడ్స్ చేస్తుండగా జస్ట్ ఈ కొన్ని రోజుల్లోనే తాను ఏకంగా 100 కోట్లు సంపాదించినట్టుగా ఇండస్ట్రీలో లేటెస్ట్ గా టాక్ వైరల్ గా మారింది. మరి ఇది మాత్రం తన సినిమాలు కన్నా అలాగే పలువురు ఇండియన్ స్టార్స్ కన్నా అధికమే అని చెప్పాలి.

మొత్తానికి అయితే ఐకాన్ స్టార్ క్రేజ్ వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక వీటి తర్వాత అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భారీ హిట్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు.