దుమారం రేపుతున్న అల్లు అర్జున్ పోస్ట్.. దీని వెనుక అసలు ఫ్యాక్ట్ ఇదేనా.?

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎప్పుడూ ఇదొక కాంట్రవర్సీ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే మన స్టార్స్ విషయంలో అయితే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి కానీ ఉన్న వాటిలో మాత్రం అవి అలా సంచలనంగా మారుతూ ఉంటాయి.

ఇప్పుడు సరిగ్గా అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ఒక మెగా వార్ కి దారి తీసింది. అల్లు అర్జున్ ఇప్పటికీ కూడా తాను మెగాస్టార్ చిరంజీవి వల్లే ఇక్కడ ఉన్నానని చెబుతాడు. అలాగే చిరు పై నిజంగా మెగా కుటుంబ హీరోలు అంత ప్రేమ చూపిస్తారో లేదో కానీ బన్నీ మాత్రం తన ఎమోషన్ ని చిరు విషయంలో దాచుకోలేడు.

మరి అలాంటి బన్నీ విషయంలో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. దానికి తోడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొందరు “మెగాస్టార్ అల్లు అర్జున్” అంటూ ట్యాగ్ పెట్టడం మరింత కలకలం రేపింది.  అల్లు అర్జున్ నిన్న పెట్టిన ఓ పోస్ట్. తమ ఫౌండేషన్ అంటూ అల్లు రామలింగయ్య ఫోటోకి తాను ఫోటో తీస్తున్న పోస్ట్ షేర్ చేసాడు.

అయితే ఇక్కడ నుంచి మొదలైంది అసలు రచ్చ. చిరు వల్ల మీరంతా పైకి వచ్చారని మెగా ఫ్యాన్స్ గుస్సా అవుతుండగా బన్నీ ఫ్యాన్స్ ఏమో దానికి ఆద్యం పోస్తున్నారు. దీనితో ఇరి వర్గాలు కొట్టుకుంటుంటున్నాయి. కానీ ఇందులో అసలు విషయం వేరే ఉందని తెలుస్తుంది.

అల్లు ఫ్యామిలీ వారు ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే, రామానాయుడు స్టూడియోస్ లా అల్లు స్టూడియోస్ ని గత లాక్ డౌన్ టైం లో స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి అల్లు అర్జున్ ఫోటో ఏదో షేర్ చేస్తే ఇది కాస్త వేరే విధంగా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. ఆ ఫోటో వెనుక ఉన్న అసలు కారణం అయితే ఇదే అని అనుకోవాలి. అంతకు మించి మరోటి ఉండదు.