మళ్లీ నవదీప్ ని ఫుల్ గా వాడుతున్న అల్లు అర్జున్?

ఫ్రెండును బ‌న్ని మ‌ళ్లీ అలా ఆడుకుంటాడా?

ఫ్రెండు కోసం ఏదో చేసేస్తున్నా అనే క‌ల‌రింగ్ ఇస్తాడు. కానీ చివ‌రికి ఆ ఫ్రెండు త‌మ‌కు ద‌క్కాల్సిన‌ది తెలివిగా కొట్టేస్తాడు. ఇదీ ఆర్య స్టైల్. ఆర్య‌లో శివ‌బాలాజీ, ఆర్య‌2 లో న‌వ‌దీప్ బ‌న్నికి స్నేహితులుగా న‌టించారు. ఆ ఇద్ద‌రు ఆర్య(బ‌న్ని) అనే క‌న్నింగ్ ఫ్రెండుకు త‌మ గాళ్ ఫ్రెండ్ ని త్యాగం చేస్తారు. లెక్క‌ల మాస్టార్ సుకుమార్ రాసుకున్న ఈ లైన్ యూత్ కి ఎక్క‌డో క‌నెక్ట‌య్యింది. `ఆర్య‌2 `బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేయ‌క‌పోయినా ఆ సినిమాలో ఛ‌మ‌క్కుల‌ గురించి అభిమానులు ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు. న‌వ‌దీప్ తో బ‌న్ని సీన్స్ ఆ సినిమాకే హైలైట్.

అందుకేనేమో.. అల్లు వార‌బ్బాయి న‌వ‌దీప్‌ని వ‌ద‌ల‌డం లేదు. మ‌రోసారి ఫ్రెండుకి ఏఏ19లో మంచి క్యారెక్ట‌ర్ లో అవ‌కాశం ఇచ్చాడు. `ఆర్య‌-2`లో అల్లు అర్జున్-న‌వ‌దీప్ ప్రాణస్నేహితులుగా అద్భుత‌మైన‌ కెమిస్ట్రీ పండించారు. అది న‌చ్చింది కాబ‌ట్టే ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ‌రోసారి ప‌ట్టుబ‌ట్టి ఆ ఇద్ద‌రినీ రిపీట్ చేస్తున్నారు. ఆ ఇద్ద‌రూ మ‌రోసారి స్నేహితులుగా క‌లిసి న‌టిస్తున్నారు. తాజా మూవీలో న‌వ‌దీప్ మ‌రోసారి ఆర్య-2 త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అత‌డి పాత్ర‌కు క‌థ‌లో అంతే ప్రాధాన్య‌త వుంటుంద‌ట‌. ఆ పాత్ర‌కు న‌వ‌దీప్ అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని అల్లు అర్జున్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎంపిక చేయించాడ‌ట‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం కాకినాడ‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. పూజా హెగ్డే ఇందులో క‌థానాయిక‌. ఇప్ప‌టికే స‌గం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్.. స్నేహం నేప‌థ్యంలోని చిత్ర‌మిది.

టాలీవుడ్ లో ఉన్న స్మార్ట్ హీరోల్లో న‌వ‌దీప్ ఒక‌రు. కృష్ణ‌వంశీ రూపొందించిన‌ `చంద‌మామ‌` త‌రువాత న‌వ‌దీప్‌కు ఆస్థాయి సినిమా రాలేదు. ఇటీవ‌ల కెరీర్ కూడా జీరో అయిపోయింది. ఇలాంటి టైమ్ లో ఫ్రెండు బ‌న్ని ఇచ్చిన ఆఫ‌ర్ త‌న‌కు ఏ మేర‌కు క‌లిసి రానుందో చూడాలి.