ఊర మాస్ డైరెక్టర్ తో బన్నీ మరోసారి

బోయపాటి శ్రీను మంచి హిట్లే ఇచ్చినా ప్రస్తుతం ఆయన వరుస ప్లాప్ ల వల్ల కెరీర్ కొద్దిగా డల్ అయింది. ఎవరెవరితోనో అయన సినిమా ఉంటుందని అనుకున్నారు కానీ మొత్తానికి ఇప్పటికి ఆయనకి బ్యానర్, హీరో రెండూ పచ్చ జెండా ఊపారు.

అది ఎవరో కాదు మన స్టైలిష్ స్టార్ అర్జున్, గీత ఆర్ట్స్ లో. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘సరైనోడు’ చాలా పెద్ద హిట్. బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలించింది. అలాగే బన్నీ మాస్ ఇమేజ్ ని కూడా అమాంతం పెంచేసింది. ఇప్పుడు మళ్ళీ అదే మేజిక్ ను చేయాలనుకుంటున్నారు బోయపాటి. ఈ సినిమా డిసెంబర్ నుండి మొదలు కానుంది.