బ‌న్ని కొర‌టాల‌కు కామ‌న్ ఫ్రెండ్ జాక్ పాట్

Allu Arjun locks mega star director for his next

యాత్ర ద‌ర్శ‌కుడికి బ‌న్ని ఆఫ‌ర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. వ‌రుస‌గా స్టార్ డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలిస్తూ త‌న స్టార్ డ‌మ్ పెంచుకుంటున్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు. అడ‌వులు.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.

ఈ మూవీ త‌ర్వాత ఎవ‌రితో? అంటే.. దానికి తాజాగా స‌మాధానం దొరికేసింది. పుష్ప చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన అనంత‌రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని న‌టిస్తారు. ఈ మూవీని కొర‌టాల స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఇంత‌కుముందు మిక్కిలినేని భ‌ర‌త్ అనే నేను చిత్రాన్ని పంపిణీ చేశారు. ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాల‌కు ఆయ‌న పంపిణీదారుడు. ఇదే కాంబోలో సినిమాని నిర్మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు బ‌న్నితో సినిమాకి ఆయ‌న తెలివైన ప్లాన్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆస‌క్తిక‌రంగా బ‌న్ని- కొరటాల మూవీని గీతా ఆర్ట్స్ 2లో తెర‌కెక్కించ‌నున్నారు. అంటే బ‌న్ని వాసు తో క‌లిసి మిక్కిలినేని ఈ సినిమాని నిర్మిస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. అల్లు అర‌వింద్ జీఏ2 బ్యాన‌ర్ కి బ్యాక్ బోన్ అన్న సం‌గ‌తి విద‌ధిత‌మే. ప్ర‌స్తుతం కొర‌టాల బృందం బ‌న్నితో సినిమాపైనా దృష్టి సారించింద‌ట‌. మ‌రోవైపు యాత్ర ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ తోనూ ఓ సినిమాకి బ‌న్ని క‌మిట‌య్యాడు. దానికి సంబంధించి స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయ‌ని స‌మాచారం.