వైయ‌స్ జ‌గ‌న్ బ‌యోపిక్‌లో అల్లు అర్జున్?

HBD Megastar Chiranjeevi Allu Arjun

                                          తెర‌వెన‌క అల్లు బాస్ బిగ్ గేమ్?

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా యాత్ర ఫేం మ‌హి.వి.రాఘ‌వ్ ఓ చిత్రం తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండ‌నుంది? అన్న‌దానిపై తాజాగా ఆస‌క్తిక‌ర లీకులు అందుతున్నాయి. నాయ‌కుడిగా బ‌న్ని పాత్ర ఫుల్ ట్విస్టుల‌తో స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ట‌.

ఇంత‌కీ ఆయ‌న ఏ నాయ‌కుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు? అంటే.. న‌మ్మ‌శ‌క్యం కాని వార్త ఒక‌టి ప్ర‌చారంలో ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాత్ర‌లో అల్లు అర్జున్ న‌టిస్తున్నార‌న్న‌దే ఆ వార్త సారాంశం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్ని ట‌చ్ చేస్తూ తెర‌కెక్కించ‌నున్న ఈ మూవీ ఒక ర‌కంగా సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అన్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

జ‌గన్ రియ‌ల్ లైఫ్ రోల్ స్ఫూర్తితోనే మ‌హి.వి ఈ మూవీలో హీరో పాత్ర‌ను తీర్చిదిద్దాడ‌ని తెలుస్తోంది. మొండివాడైన ఒక యువ‌నాయ‌కుడు ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తూ ఎన్నిక‌ల్లో అలుపెర‌గ‌ని పోరాటం చేసి గెలిచి సీఎం అవుతాడు. ఇదే ఈ మూవీ థీమ్ లైన్ అన్న గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే బ‌న్ని కెరీర్ లోనే ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ మూవీగా నిల‌వ‌నుంద‌నే అర్థం.

అయితే ద‌ర్శ‌కుడు ఎంపిక చేసుకున్న హీరోనే స‌ర్ ప్రైజ్ చేస్తోంది. అస‌లు జ‌గ‌న్ పాత్ర‌లో అల్లు కాంపౌండ్ హీరో న‌టించ‌డ‌మేమిటి? అన్న గుస‌గుస‌లు తాజాగా వేడెక్కిస్తున్నాయి. జ‌గ‌న్ రియ‌ల్ లైఫ్ లో ప్ర‌జారాజ్యం కీల‌క నాయ‌కుడి కుమారుడా? అన్న‌ ముచ్చ‌టా ఆస‌క్తిక‌రంగా మారింది. అస‌లు ఇది నిజ‌మా? అబ‌ద్ధ‌మా? అన్న‌ది అటుంచితే తెలుగు సినీమీడియాలో గుస‌గుస‌లు మాత్రం అంత‌కంత‌కు హీట్ పెంచేస్తున్నాయ్. ఇక విశాఖ రాజ‌ధాని విష‌యంలో మెగాస్టార్ చిరంజీవి స‌హా అల్లు అర‌వింద్ ఎంతో పాజిటివ్ గా స్పందించారు. విశాఖ‌లో టాలీవుడ్ నిర్మాణానికి చిరంజీవిని జ‌గ‌న్ ఆహ్వానించారు. అక్క‌డ భారీ మెగా ఫిలింస్టూడియో నిర్మించేందుకు ఈ జోడీ ప్లాన్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తుండ‌గా.. తాజా కాంబినేష‌న్ కూడా మ‌రింత ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేపింది.