చిరంజీవిని పట్టించుకోని బన్నీ ఫ్యాన్స్!!

మెగాస్టార్ చిరంజీవి ఫాలోయింగ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. అయితే ఈ మాటలు ఒకప్పుడు మాత్రమే చెల్లుబాటు అయ్యాయోమో అనేట్టుగా మారిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో చిరంజీవి హవా ఏ మాత్రం లేదు. మొన్నటికి మొన్న బర్త్ డే ట్రెండ్‌ను దాదాపు ఇండియా వైడ్‌గా వంద మంది సెలెబ్రిటీలతో కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయించి ప్రారంభించారు. ఇక రోజు మొత్తం కష్టపడితే ముక్కీ మూలిగి 2.6 మిలియన్ల ట్వీట్స్ మాత్రమే చేశారు. అది కూడా మధ్యలో తప్పుడు ట్యాగ్‌తో కొన్ని ట్వీట్లు చేశారు. ఇలా చిరంజీవి బర్త్ డేను మొత్తం నీరు గార్చారు.

Allu Arjun Fans Create Indian Style Icon Trend In Twitter
Allu Arjun Fans Create Indian Style Icon Trend In Twitter

అయితే అదే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఎంతో నిబద్దతో ట్రెండ్ చేస్తారు. ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్, బన్నీల విషయాలను ట్రెండ్ చేస్తారు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేరిట 65 మిలియన్ల ట్వీట్లతో ఓ రికార్డును క్రియేట్ చేసి పెట్టారు ఫ్యాన్స్. తాజాగా బన్నీ విషయంలోనూ ఫ్యాన్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకపోయినా నిన్నంతా అల్లు అర్జున్ సందడి కనిపించింది. ఇండియన్ స్టైల్ ఐకాన్ అల్లు అర్జున్ అనే హ్యాష్ ట్యాగ్‌ను దేశ వ్యాప్తంగా ట్రెండ్ చేశారు. మొత్తంగా 24 గంటల్లో కోటి ట్వీట్లను చేసి బన్నీ సత్తా చాటారు ఫ్యాన్స్. అదే చిరంజీవి విషయంలో వీరంతా సైలెంట్‌గా ఉన్నారు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్‌లో బాగానే చీలికలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. అటు పవన్ ఫ్యాన్స్ వేరు పడ్డారు.. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం అంతే దూరాన్ని మెయింటేన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.