చిరంజీవిపై మంటతోనే రాజశేఖర్ కి ఛాన్స్!
కొన్ని కాంబినేషన్లు ఊహించని సర్ ప్రైజ్ ని కలిగిస్తాయి. అలాంటి సర్ ప్రైజ్ లేటెస్టుగా మెగాభిమానుల్ని ఊపేస్తోంది. దానిపై ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాస్ అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవిని కాదని హీరో రాజశేఖర్ కి అవకాశం ఇవ్వడమేమిటి? అన్నదే అందరి సందేహం. బావ చిరంజీవి తనతో చేయనని అన్నారా? అందుకే చిరు అంటే ఎంతమాత్రం సరిపడని రాజశేఖర్ ని అక్కున చేర్చుకున్నారా? అరవింద్ ఆన్సర్ ఏమై ఉంటుంది?.. అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది.
కెరీర్ కీలక సమయంలో రాజశేఖర్ డౌన్ ఫాల్ గురించి తెలిసిందే. దాని వెనక రకరకాల కారణాలపైనా అప్పట్లో ఆసక్తికర చర్చ సాగింది. రాజశేఖర్ చాలా సందర్భాల్లో చిరంజీవికి విరోధిగానే కనిపించారు. పైకి మాటా మంతీ సాగిస్తున్నా.. పలుమార్లు ఇరువురి మధ్యా వైరం మీడియా ముఖంగానే బయటపడింది. అప్పట్లో మెగాస్టార్ పై రాజకీయం పరంగా రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం.. అనంతరం అతడి కార్ పై మెగా ఫ్యాన్స్ దాడి చేయడం .. అనంతరం చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పడం వంటి ఎపిసోడ్స్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.
మొన్నటికి మొన్న `మా డైరీ -2020` ఆవిష్కరణలో రసాభాస కళ్లముందు ఇంకా ప్రత్యక్షమవుతూనే ఉంది. చిరంజీవి సహా పెద్దలు ఉన్న సభలో రాజశేఖర్ కామెంట్లు చేయడం… అటుపై క్రమశిక్షణా ఉల్లంఘన పేరుతో అతడిని చిరంజీవి సభ నుంచి బహిష్కరించడం .. చర్యలు తీసుకోవాల్సిందిగా కమిటీకి వెల్లడించడం వగైరా ఎపిసోడ్స్ మరోసారి ఆ ఇద్దరి మధ్యా విరోధాన్ని బహిర్గతం చేశాయి.
ఇన్ని ఎపిసోడ్స్ సీక్వెన్సుల తర్వాత కూడా ఇంకా మెగా నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా రాజశేఖర్ కి ఇలాంటి ఆఫర్ ఇస్తారా? గతాన్ని మరిచారా? లేక మెగాస్టార్ చిరంజీవి గీతా ఆర్ట్స్ కి కాల్షీట్లు ఇవ్వకుండా దూరం పెట్టడం వల్లనే ఆయన ఇలా చేస్తున్నారా? అంటూ ఆశ్చర్యంతో కూడుకున్న సందేహం వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో రీఎంట్రీ ఆఫర్ తనకే దక్కుతుందని భావించిన అరవింద్ కి ఆశాభంగం తప్పలేదు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని ప్రారంభించి తన తల్లికి గిఫ్ట్ ఇవ్వాలనే తన తండ్రికి నిర్మాతగా మారుతున్నానని చరణ్ ఝలకిచ్చారు. ఆ తర్వాత కనీసం చిరు 151 ఆఫర్ అయినా తనకే దక్కుతుందని ఆశిస్తే నాన్నకు సరైన గిఫ్ట్ ఇవ్వాలని సైరా తీస్తున్నా అంటూ మరోసారి కొణిదెల వారసుడు చెక్ పెట్టేశాడు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 153వ సినిమాకి కూడా అల్లు అరవింద్ కి ఛాన్స్ లేకుండా పోయంది.
ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే మెగా నిర్మాత అరవింద్ కి గీతా ఆర్ట్స్ కి ఇప్పట్లో మెగాస్టార్ తో ఛాన్సే లేదని అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ఎలాంటి భేషజం లేకుండా రాజశేఖర్ ని దరికి చేరనిచ్చారు అరవింద్! అని అభిమానులు భావిస్తున్నారు. రాజశేఖర్ హీరోగా మలయాళ బ్లాక్ బస్టర్`జోసెఫ్` రీమేక్ కానుంది. ఈ మెడికల్ థ్రిల్లర్ మూవీలో రాజశేఖర్ ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందిట. అయతే రాజశేఖర్ – అల్లు అరవింద్ రేర్ కాంబినేషన్ ఊహించనిది. అందుకే ఇన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.