బాలయ్య రెయిన్ సాంగ్ రీమిక్స్ లో అల్లరి నరేష్

స్టార్ హీరోల సూపర్ హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయటం సహజమే. ఇప్పటికే చాలా పాటలు అలా మరో తరానికి ట్రాన్సఫర్ అవుతూ అలరిస్తున్నాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ కు ఇలాంటి రీమిక్స్ సాంగ్స్ అంటే భలే ఇష్టం. గతంలో కృష్ణ వజ్రాయిధంలోని సన్నజాజి పక్క మీద పాటని, చిరంజీవి కొండవీటి దొంగలోని మంచమేసి దుప్పటేసి పాటను, కృష్ణ సింహాసనంలోని ఆకాశంలో ఒక తార ఇలా ఎన్నో పాటలు రీమిక్స్ చేసారు. ఇప్పుడు బాలయ్య సూపర్ హిట్ సాంగ్ ని సైతం రీమిక్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏమిటా పాట..

బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన బంగారుబుల్లోడు చిత్రంలోని స్వాతిలో ముత్యమంత అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఆ పాట ప్రోమోను విడుదల చేసి ఖరారు చేసారు. అప్పట్లో బాలయ్య, రవీనా టాండన్‌లపై చిత్రీకరించిన ఈ పాటను ఇపుడు పూజా ఝవేరితో కలిసి అల్లరి నరేష్ వాన పాటకు చిందేయనున్నాడు.

Wishing Our #BangaruBullodu Allari Naresh a Very Happy Birthday

అల్లరి నరేశ్‌ కీలక పాత్రలో వస్తున్న సినిమా ‘బంగారు బుల్లోడు’. ఈ సినిమాకు పి.వి గిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజా ఝవేరీ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘మహర్షి’ సినిమాలో నరేశ్‌కు కీలక పాత్రలో నటించారు. ఆయన పాత్రకు మంచి ఆదరణ లభించింది.