త్రివిక్రమ్ , అల్లు అర్జున్ చిత్రం టైటిల్ ” అల వైకుంఠ పురంలో ..”
అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, హారిక హాసిని క్రేఅషన్స్ రాధా కృష్ణ నిర్మిస్తున్న సినిమాకు ” ఆల వైకుంఠ పురంలో ..” అన్న పేరును నిర్ణయించారు . స్వాతంత్ర దినోత్సవం రోజున నిర్మాత దర్శకులు కలసి ఈ టైటిల్ ను నిర్ణయించినట్టు , అల్లు అర్జున్, పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా తెలిపారు . అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న మూడవ సినిమా ఇది . గతంలో వీరిద్దరూ “జులాయి ” , ” సన్నాఫ్ సత్యమూర్తి ” చిత్రాల్లో కలసి పనిచేశారు . ఈ మూడవ సినిమాను అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది .
“అల వైకుంఠపురంలో ..” టైటిల్ చాలా క్లాస్ గా ఉందని అంటున్నారు . త్రివిక్రమ్ తన చిత్రాల టైటిల్స్ కు ఎదో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు . ఈ సినిమాలో అల్లు అర్జున పక్కన నివేతా పేతురాజ్ కూడా నటిస్తుంది . మిగతా పాత్రల్లో టబు , జైరాం , సుశాంత్ , మురళి శర్మ ,హర్షవర్ధన్, నవదీప్ నటిస్తున్నారు . ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కాబోతుంది .