బాలీవుడ్  వెబ్ సిరీస్ పై అఖిల్ మోజు!?

Akhil Akkineni

కరోనా వైరస్ మహమ్మారి తో వినోదరంగం  విలవిలలాడిపోతోంది.  ప్రపంచ దేశాల ప్రజలు  మహమ్మారి బారిన పడటంతో లాక్ డౌన్ అమలు లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయం లో ప్రజలు ఎక్కువగా సమయం వెచ్చించినది ఆన్లైన్ ప్లాట్ ఫామ్ లు అని చెప్పాలి. వెబ్ సిరీస్ లకు విపరీతంగా డిమాండ్ పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇపుడు అన్ని కూడా దాదాపు ఆన్లైన్ ద్వారా నే విడుదలవుతున్నాయి. అయితే తాజాగా ఇలాంటి  వెబ్ సిరీస్ ల పై  టాలీవుడ్ హీరో అఖిల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కే అక్కినేని కుటుంబం నుండి సమంత ‘ది ఫ్యామిలీ మాన్ 2’ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అదే తరహా లో బాలీవుడ్ లో ఒక క్రేజీ వెబ్ సిరీస్ లో నటించేందుకు అఖిల్ కి ఒక అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అందులో రాక్ స్టార్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ పై  అఖిల్ మోజు పాడడం అందర్నీ ఆలోచింపజేస్తోంది.  టాలీవుడ్ హీరోలంతా ఎప్పుడు ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు.