పూరి పంచ్‌ల‌తో కుర్ర‌హీరోలకు ప్ర‌మోష‌న్ బావుందే

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు. పూరి జ‌గ‌న్నాథ్ పంచ్ డైలాగులకు అభిన‌యిస్తూ ఆ ఇద్ద‌రు యువ హీరోలు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఎటెంప్ట్ బావుంది. ఓవైపు పూరి పంచ్ ల‌కు మైలేజ్ పెరిగింది. అలాగే కుర్ర హీరోలు ఆకాష్ పూరి- రాహుల్ విజ‌య్ ఇద్ద‌రికీ ఐడెంటిటీ పెరిగింది.

మొత్తానికి పూరి సినిమాల్లోని పంచ్ డైలాగుల‌కు ఆ ఇద్ద‌రూ ప‌లికించిన అభిన‌యం ఆహార్యం ఆక‌ట్టుకుంద‌న్న ప్ర‌శంస‌లు దక్కుతున్నాయి. వియ్ ల‌వ్ సినిమా. ఎక్స్ ట్రా ల‌వ్ టు పూరి జ‌గ‌న్ .. అంటూ ఆకాష్ ఈ వీడియోని షేర్ చేశారు. రాహుల్ కాల్స్ ఆకాష్ అన్న‌ది క్యాప్ష‌న్. మొత్తానికి కాల్ బావుంది. ఆ వీడియోని మిక్స్ చేసిన తీరు ఇంకా బావుంది. పూరి పంచ్ డైలాగుల‌న్నీ ఒకేచోట గుదిగుచ్చి వినిపించిన తీరు అల‌రించింది. మొత్తానికి వీడియో బ్లాక్ బ‌స్ట‌ర్.

పూరి తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు పోకిరి.. ఇడియ‌ట్.. బిజినెస్ మేన్ స‌హా ప‌లు చిత్రాల్లోని డైలాగుల్ని ఈ రీమిక్స్ కోసం ఉప‌యోగించారు. ఇంట్రెస్టింగ్.. క్రియేటివ్.. యువ‌హీరోల ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంది. ఆకాష్ న‌టించిన రొమాంటిక్ లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ విజ‌య్ త‌దుప‌రి సినిమాల వివ‌రాలు తెలియాల్సి ఉంది.