వినయవిధేయరామ డిజాస్టర్ తర్వాత బోయపాటి శ్రీను ఏం చేస్తున్నాడు…ఎక్కడున్నాడంటూ మీడియాలో రకరకాల వార్తలు,రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదో పజిల్ గా మారింది. కొందరైతే ఏకంగా బోయపాటి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్నారు. అయితే ఆయన ఎక్కికి వెళ్ళలేదు..హ్యాపీగా అమరావతిలో సెటిల్ అయ్యారు. అక్కడ ఆయన తెలుగుదేశం పార్టికి సంభందించిన యాడ్స్ చేస్తున్నారు. పార్టి ప్రమోషనల్ యాక్టివిటీస్ ని డైరక్ట్ చేస్తున్నారు. అందుకు తగ్గ కంటెంట్ ని రెడీ చేస్తున్నారు. ఎలక్షన్స్ సమయం దగ్గరకు రావటంతో స్పీడు పెంచారట.
మొదట రాజమౌళిని అడగారు కానీ ఆయన తాను ఆర్ .ఆర్ .ఆర్ చిత్రం బిజిలో ఉన్నానని..తను రావటం కష్టమని తేల్చటంతో బోయపాటికే పూర్తి భాధ్యతలు అప్పచెప్పారని వినపడుతోంది. అయితే రాజమౌళి వచ్చినా బోయపాటికు ప్రత్యేకమైన ప్రాజెక్టు అప్పచెద్దామని ఫిక్స్ అయ్యారట. అయితే రాజమౌళి పూర్తిగా తప్పుకోవటంతో ఆ భాధ్యత మొత్తం బోయపాటిపై పడిందిట. ఆయన తన అసిస్టెంట్స్ తో యాడ్స్ కాన్సెప్ట్ లు ఓకే చేయటం..ప్రమోషనల్ వీడియోలు షూట్ చేయటం చేస్తున్నారు. ఎలక్షన్స్ అయ్యేదాకా ఆ పనిలో ఉంటారు బోయపాటి. ఆ తర్వాత బాలయ్యతో సినిమా పని ప్రారంభిస్తారు.