అడివిశేష్ నెక్ట్స్ మూవీ టైటిల్‌.. .హీరోయిన్‌?

                                                               (ధ్యాన్)

రీసెంట్‌గా విడుద‌లైన `గూఢ‌చారి` సినిమాతో హిట్ కొట్టిన అడివిశేష్‌కి మంచి క్రేజ్ వ‌చ్చింది. ఇప్పుడు ఇత‌ని సినిమాల‌పై అంద‌రి ఫోక‌స్ పెరిగింది. అడివిశేష్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి `2 స్టేట్స్‌`. ఈ సినిమా త‌ర్వాత పివిపి సినిమా బ్యాన‌ర్‌లో ఓ సినిమా.. ఓ డిస్ట్రిబ్యూట‌ర్‌ను నిర్మాత‌గా ప‌రిచ‌యం చేస్తూ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు అడివిశేష్‌. ఇందులో పివిపి బ్యాన‌ర్‌లో ఈ హీరో చేయ‌బోయే సినిమా త్వ‌ర‌లోనే స్టార్ట్ కానుంది. ఇదొక థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ అట‌. ఈ సినిమాకు ఎవ‌రు అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో హీరోయిన్‌గా చెన్నై సొగ‌స‌రి రెజీన క‌సండ్ర న‌టించ‌నుంది. త్వ‌ర‌లోనే అధికారిక స‌మ‌చారం వెలువ‌డ‌నుంది.