తల్లి వారసురాలిగా అదితి రావు హైదరి

అదితి రావు హైదరి రెండు సంస్కృతుల  సితార . తెలుగు , తమిళ , మలయాళ , హిందీ చిత్రాల్లో నటిస్తున్నది .

తెలుగులో చెలియా, నవాబ్ , సమ్మోహనం చిత్రాల్లో నటించింది . విడుదల కాబోయే అంతరిక్షం  సినిమాలో కూడా అదితి రావు నటిస్తున్నది .

ఈమె తండ్రి ఇషాన్ హైదరి  తల్లి విద్యారావు . వీరిది ప్రేమ వివాహం . వీరికి జన్మించింది అదితి రావు హైదరి .  అటు తండ్రి పేరు ఇటు తల్లి పేరు కలిపి తన పేరులో పెట్టుకుంది. తండ్రి నిజాం సంస్థానం కు చెందివావాడు కాగా తల్లి తెలంగాలో వున్న ఒకప్పటి సంస్థానం  వనపర్తి కి చెందింది .

విద్యారావు మంచి గాయకురాలు .. ఆమె వార సత్వాన్ని ఇప్పుడు కుమార్తె కొనసాగిస్తుంది . నటనతో పాటు అదితి రావుకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం . అప్పుడప్పు వేదికలపై తన గళం వినిపిస్తున్నది .

ఆ మధ్య ఏఆర్ రెహ్మాన్ నిర్వహించిన ఓ రియాలిటీ షో లో అదితి పాడింది . ఈ పాటను విన్న తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ “జైలు ” అనే చిత్రంలో గాయనిగా అవకాశం ఇచ్చాడు . ఈ సినిమాకు వసంత  బాలన్ దర్శకుడు .

అయితే ఈమె గొంతు బాగుందని భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తానని ప్రకాష్ చెప్పాడు . ఇక ముందు అదితి రావును గాయకురాలిగా చూడొచ్చు .